...

0 views

షాపింగ్
జీవిత పుస్తకంలోని అధ్యాయాలలో వెదికితే చాల రేర్ గా దొరికే పదం షాపింగ్.. జీవితం దొరికేది ఒకసారి మాత్రమే అందులో కాలం కూడా చాలా విలువైనది. ఓ సారి పోగొట్టుకుంటే పొందడం చాలా కష్టం. జీవించడానికి ఉపాథి ఎంత ముఖ్యమో అందులో పొందే ఆదాయం దానికంటే విలువైనది. చమటోడ్చకుండా ఏదియు రాదు ఆకలి అవుతుంది అంటేనే అమ్మ అన్నం పెడుతుంది కదా.. నా దృష్టిలో ముఖ్యం కానిది షాపింగ్ మాత్రమే. అలా అని ఖరీదు చేయనని అనుకోకండి. నాకు ఇది తప్పని సరి అవసరం ఇది లేకుండా నడవదు అంటే తప్పకుండా ఎంత వెలనైనావెచ్చిస్తాను ఖరీదు చేస్తాను.. కష్టాల నుండి పై కేదిగిన దాన్ని పైసా విలువ నా దృష్టిలో చాలా ఎక్కువ, అలాగని పిసినారిని కాను.. అలా అనే అవకాశాన్ని ఎవరికి ఇవ్వను. దీని అర్థం పొడుపరి, ఇక డబ్బు ఉందని నీళ్ళ లాగ ఖర్చు పెట్టాను.. నేను నా విధి కంటే ఎక్కువే పొందాను. చిరునవ్వుతో చూస్తే ఆ ప్రదేశమంతా రంగులమయం. తడి కనురెప్పల వల్ల చూస్తే అద్దం కూడా అస్పష్టంగా కనిపిస్తుంది.ఉన్నదానికంటే ఎక్కువే పొందాను అలాగని తక్కువుంటే ఒప్పుకోను,
నా జీవితంలోకి లభించివాటికి, నేను పొందిన వారిని ధన్యవాదాల తెలుపుతూ ప్రతి క్షణాన్ని అందంగా మలుచుకుంటాను. దొరకక పోతే బాదే లేదు. అది ఏదేని కానీ తప్పనిదైతే పొంది తీరుతాను ఇదే నా వ్యక్తిత్వం.గొప్పలు చెబుతుందని మీరు అనుకుంటే మీ ఇష్టం. నిజం ఉండగా అబద్ధం అసలే పలకను,పలికితే నా వ్యక్తిత్వానికి వ్యతిరిక్తను నేనే.. ఇది నా షాపింగ్ పట్ల నాకున్న అభిప్రాయము.. నచ్చితే హర్షించండి, నచ్చక పోతే ఖండించండి షాపింగ్ చేయాలి అవసరం అనుకుంటే తప్పక చేస్తాను అవసరాల విలువ బాగా తెలిసిన దాన్ని ఆచితూచి అడుగేస్తాను ...
సంపంగి బూర✍️