...

0 views

మార్పు
ప్రేమ అంగీకారం అనేది మార్పునుకోరే శక్తివంతమైన ప్రతినిధులు.. బంధాలన్నీ అశాశ్వతమే అందు ప్రేమ శాశ్వతమనడం తప్పే.. మన ప్రవర్తన ఆదర్శమై ఆచరణ యోగ్యతను పదిమంది కోరే మార్పుగా ఉండాలి కానీ పరిహసించేదిగా ఉండకూడదు.. అంతరంగం ఓ రణభూమి ఆశ నిరాశలు పగబట్టిన ఓ శత్రువులా ఒక్కసారి విరుచుకుపడతాయి.. అందరూ నా వల్లే అంతా నాదే ఓ భావన తునక ఎగిరెగిరి పడుతుంది నా పిచ్చి మనసులో.. నేను ఎక్కడలేననీ, యే మనోదశలో లేననీ, ఎడారి అయిపోయాయి కన్నుల్లో ఇక యే మరీచికా సంభవతా శేషం లేదు. ఈ తుఫాను ఇసుకలో మిళీతమయ్యే నేనూ నా భావనలు.. మిగిలిన వారికి ఏడుపు కన్నీళ్లు పిడికెడు జ్ఞాపకాలు ఇచ్చిపోయే మార్పు...
సంపంగి బూర✍️