...

0 views

నువ్వూ - నేను
ఉన్నది నీవే తోడంటూ నా మొదటి పరిచయమే నీవంటూ నాలో నేను లేనంటూ అలజడి రేపిన గుండెల్లో గమ్యం లేని దారిలో నీవు లేని వెలుతురులో కనులు చూడని చీకటిలో కరిగిపోయాను నిన్నటిలా ప్రియతమా.. పొంగిన ప్రేమ శోకంతో నీవు వస్తావన్న చిరు ఆశయే ఊపిరి పోసి జీవింప చేస్తుంది నాలో దాగి ఉన్న నేస్తమా కనులకు రూపమైన ప్రియతమా.. మనసు మౌనానికి అంతమీయకు నిశ్శబ్దానికి మించిన మరో నిశ్శబ్దం సృష్టించకు నిజము నిక్కచ్చి ప్రేమ నీదే అయితే అబద్ధానిక మించిన అందమైన చుట్టం కాకు ఒంటరి నేను నీటి బిందువును మాత్రమే నీతో కలిసి సాగరమే ఉలి తాకని శిలగా నీవు వదలకు నన్ను ప్రాణమా ...
సంపంగి బూర✍️