...

0 views

వాస్తవం,కానీ చెదైన నిజం
ఈ ప్రపంచాన్ని అనుభూతి చెందే సమర్ధతను వెలుగే మనకు ఇచ్చేది స్నేహమే.. సృష్టిని రంగులమయం చేసింది కూడా స్నేహమే.. మనసును,మనిషినీ యవ్వనంగా ఉంచేది స్నేహితులు మాత్రమే.. లేకపోతే పిల్లలు నీవు మాకేం ఇచ్చావని ప్రశ్నిస్తారు.. ఎప్పటికి నిజం కాని కలల నిప్పుల్లో మేము కాలిపోతూ మేమూ,, మా రక్తాన్ని దీపంగా వెలిగించి చీకటిని పారదోలాము.. నేడు సుఖపు రెండు మేతుకులకోసం అల్లాడిపోతున్నాము.. అయినా మా పిచ్చి కాకపోతే పిల్లలపై ఇసుమంత కూడా లేని అధికారానికి మాకెందుకింత తాపత్రయమో !? నా స్నేహితునికి ఏమివ్వకపోయినా ప్రతిరోజూ ఎలాఉన్నావని పలకరించి పోతాడు.. "అడ్డలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు" రెక్కలొచ్చి ఎగిరిపోయారు..
తల్లిదండ్రులను ముల్లెమూట సంకనెట్టి రెక్కలు విరిగిన పక్షులను మెడ పట్టిగెంటినారు.. యాడ పోదాము ఎలా బతుకుదాము,? అలా చెట్టునీడలో కూర్చునా మాకు చేతికి నీరందించిన నా దోస్త్ ను చూడగానే బావురుమని ఏడవడంతప్ప చేసేదిలే.. తన ఇంటికి తీసుకెళ్ళి మీకు నేనున్నానని ధైర్యంతో నిండిన బలాన్నిచ్చాడు... స్నేహం ప్రేమకు ఏం
తక్కువేమీ కాదు.. .
సంపంగి బూర✍️