...

1 views

స్నేహమే బలం
నిజానికి స్నేహం స్నేహం ఉంటే. గంధపు చందనంలా, వేల ముక్కలుచేసినా కూడా పరిమళం పోదు.. నాటి ఆ స్నేహాన్ని సరితూగిస్తే నేటి స్నేహం స్వార్థంతో నిండి చలన రహిత బండరాయి.. హృదయ కన్నులతో చూసినప్పుడే స్నేహం చూపులతో ప్రారంభం, అపుడే నిజమైన స్నేహం ప్రారంభం అగును.. ఎదుటివారి మనస్తత్వం, భావం, పద్ధతి, అనుకరణలపై మన స్నేహం బలపడుతుంది.. ఎదుటివారిని, మంచి భావనతో మనస్ఫూర్తిగా అర్థంచేసుకున్న క్షణాన నిజస్నేహానికి పునాది వేయబడుతుంది. మనం వారి భావార్ధాలను,కదలికలను గ.మనిస్తూ అర్ధంచేసుకోవాలి.. స్నేహం, స్నేహితుల అభివృద్ధికి తోడ్పడునదిగా ఉండ వలెను .. అదేక్షణాన, మనలను మనం అర్ధంచేసుకొనుటకు ప్రయత్నించాలి.. స్నేహం విజయాలను ఆశించేదిగా ఉండకూడదు.. ఇరువురి హృదయాలు ఇరువురి విజయాలను
ఆవ్వానించేదిగా విధేయభావులై ఉండాలి.. స్నేహం నమ్మకం, విశ్వాసాల ఉనికిపైనే నిలబడుతుంది ముఖ్యంగా. నమ్మకం ఇరిగిపోకుండా, విశ్వాసం కూలిపోకుండా అబద్ధాలు ఆడకూడదు.. ఏ చిన్న భంగం వాటిల్లకూడదు.. అప్పుడే అది బలమైన స్నేహంగా ఉంటుంది.. విశ్వాసం మనస్పునాధులపై నిలబడుతుంది నమ్మకంగా నీ కుడి భుజ బలాన్ని ఇస్తుంది. నిత్యం నీకై నేను అంటుంది...
సంపంగి బూర✍️