...

1 views

పిడికిలి
పేదల మెతుకుల కల్లోలిత ప్రవాహంలో కడుపు గోడుల ఆర్తనాదాలను అరికట్టే ఆప్తులం.. మట్టిలో మాణిక్యాలు పండించ మట్టిపోరలలోని పురుగులం.. పిడికిలి బిగిసిన హృదయాలలో కడలిని మించిన ఆశలెన్నో. అనుక్షణం నడిపించును చూపుల చుక్కానులం.. అక్షరాలు నిండగా కళ్ళు తెరిచిన పుస్తకంలో ఒళ్లంతా నిండిన స్వేదనతో సమానత్వపు సమాజాన్ని పిడికిలితోనే రాలిపడ్డ చోటే మళ్ళీ మొక్కగా జనించే దేశ ముదురులం.. పెద్దనోట్ల రద్దుని తరిమికొట్టి అవినీతిని రద్దుచేసి చెల్లింపుల మళ్ళీంచే ఎక్కడపడితే అక్కడ బడాబాబుల అవినీతి ఆశ దాడులలో కుప్పలు కుప్పలుగా దొరికే పెద్దనోట్ల గడ్డీల కోసం బిగించు పిడికిలి విసిరి కొట్టు పులిపంజాలం.. కూల్చిన కూకటి వేళ్ళను నిలబెట్టే నిజాయితీలం..
సంపంగి బూర✍️