...

0 views

హార్డ్ టైం
మన భవిష్యత్తు ఈ రోజు మనం చేసే దాని ద్వారా చేయబడుతుంది, రేపు కాదు,, జీవితం కూడా ఏంటో విషాదము లేకుండా ఉండనే ఉండనివ్వదు,, ఏడడుగుల బంధం జీవిత మార్గంలో
కష్టాలు/సుఖాలు, దుఃఖాలు/ఆనందాలు,
విషాదాలు/సంతోషాలు ,తీపి/చేదు,
ప్రేమ/మమకారం,అనురాగం/ఆప్యతా
తీపి/వగరు.
ఇలాంటి బంధాలతో బాంధవ్యాలు ఏర్పరచుకొని ప్రేమ/మమకారం, పిలుపు జీవించమన్నది.. అందుకే మనిషి జీవితంలో ఏర్పడినవి హార్డ్ టైంలో హార్ట్ ఎటాక్ లు,, తప్పించుకోవడం ఎంత ఎంత కష్టం, కష్టాల నుండి అవి కలిగించే నష్టాలనుండి, కోరికల నుండి అవి కలిగించే కన్నీటి చారికలనుండి జన్మించిన జన్మ మొదలు అది కలిగించే కర్మల నుండి, కానీ ఎపుడు కూడా మనిషి హార్డ్ టైంను చూసి కృంగి కృశించకూడదు.. No pain no gain జీవితం అన్నాక జీవించే మనిషి అన్నాక ఇవన్నీ మామూలే అవి ఇచ్చే అనుభవాలు పాఠాలై బ్రతుకు అభ్యసనాలై జీవించమని నేర్పిస్తాయి జీవనాన్నీ,,
*****,
ప్రస్తావన ఎలా ఉందంటే నిన్ను జీర్ణించుకోలేకపోతున్నాను నేను మీ బెంగ ఎలా ఉందంటే ఎప్పటికీ అంతం కానంతగా ఉన్నాయి.. హార్డ్ టైం ఎవరన్నా భయపడతారేంటి.. సమస్యలు మనం ఊహిస్తున్నంత శక్తివంతం కావు.. చీకటి ఉదయాన్నే రానివ్వలేదని ఎప్పుడైనా విన్నారా మరి హార్డ్ టైం కి భయమేలా
సంపంగి బూర✍️