...

5 views

వెన్నెల ప్రేమ ❤️
స్వప్న లోకంలో కలల వేడుక
తొంగి చూస్తుంది పున్నమి జాబిలి |

నెలవంక కలంతో వెన్నెల వేడుక చేశా
మనోహరుడి మనసు దోచా |

నడిరోడ్డున అబల ఆక్రందనలు
వేడుక చూస్తున్న వెర్రి జనాలు |

కులమతాలంటూ రెచ్చగొట్టడం
వేదాలు వల్లిస్తూ వేడుకలో నేతలు |

అబద్దాలతో వేడుకగా బతికినా
ఆఖరి మజిలీలో ఒంటరివే |

వేడుకగా మిగిలేది జీవితమేనా
వయసు వేడిలో పుట్టే ప్రేమ కూడా |

వేడుకగా కొత్త కోడలు వచ్చింది
యధావిధిగా అత్తా కోడళ్ళ పోరు |

ఆడంబరాలకు పోయి వేడుకలు చేశాడు
అప్పులపాలై ఐపి పెట్టాడు
©సూర్యసముద్రససుర

© సూర్యసముద్రSasura