...

5 views

నీ ధృడచిత్తం ముందర దురదృష్టం నిలుచునా..
ఆరాటం లేకుండా ఆటంకాల్ని దాటగలమా..
పోరాటం చేయకుండా జయాలని పొందగలమా..!!

చేజారిన జీవితాన్ని తిట్టుకుంటూ చీకటిలో మగ్గుతుంటే..
చెదిరిపోయిన కలలన్నీ నీ ఓటమిని ఒప్పుకోవా...!!

నీ ధృడచిత్తం ముందర దురదృష్టం నిలుచునా...
బెదిరించిన బాధలే భోధించును పాఠాలు..!!

ఎదిరించే నీ ఆత్మస్థైర్యం ఎదురునా విధిరాత సైతం తలదించగా...!!

పడిలేస్తూ నేర్చుకో ధైర్యం..
పరుగెత్తుతూ తలుచుకో గమ్యం..!!

నీ చెమటనే చిందించి నీ స్వప్నాలను చేధించగా...
సహనంతో సాగించు నీ పయనం..నీకు నీవే సైన్యం!!
© Rajani Reddy