...

1 views

జీవన పోరాటం
ఆకలి గుడి బయట.
ఆశలు గుడి లోపల
అందరూ యాచకులే ఇక్కడ
ఇదొక్కపోరాటం.
. రెక్కాడితే డొక్కాడని ఆకలికి తెలుసు జీవించాలని గుండె పగుళ్లకు తెలుసు
మోయలేని వేదన దుఃఖానికి తెలుసు
ఆశల తీరం తెలియని ఓటమి తీరాలకు తెలుసు పిడికెడు మెతుకులకై నాలుగు గోడల కూడలి వద్ద పని ఇచ్చే మేస్త్రీ కొరకు ఎదురుచూచి ఆడ,మగ కనులకు తెలుసు..
అక్షరాలను మోయలేక చిన్న ప్రాయంలోనే బాధ్యతలు మోసే భుజాలకు తెలుసు,
సిగ్నల్ ల వద్ద పొట్ట చేత పట్టుకొని కార్లను తుడిచే పసికందులకు తెలుసు,
చిన్న చిన్న వస్తువులు అమ్మే ఆ పూటకు నాలుగు నాణాల సంపాదించే బాల బాలికలకు తెలుసు గ్లాసెడు గంజినీళ్ళు విలువ తెలుసు
కూడూ, వస్త్రం, గూడు లేని వారికి తెలుసు
ఆశల ఆరాటంలో జీవన పోరాటం,
వేదనలకు ఎంత ఆనందమో
పేదల బతుకులను గజిబిజి చేయాలని ...
సంపంగి బూర✍️