...

3 views

కవితలు నాకు చెపుతున్నాయి
#WritcoPoetryDay
కవితలు నాకు చెపుతున్నాయి. ‌‌
అక్షరాలతో మమ్మల్ని అందంగా తీర్చిదిద్దు అని.
అందమైన కలలతో మమ్మల్ని అలంకరించు అని.
కవితలు నాకు చెపుతున్నాయి.
మమ్మల్ని అక్షరాలతో అందంగా ముస్తాబు చేయి అని.
భావోద్వేగాలతో భవబంధాల లేఖలు వ్రాయమని.
కవితలకి అక్షరాలతో అభిషేకం చేయమని.
భావాలతో సునామీ సృష్టించమని.
కవితలు నాకు చెపుతున్నాయి.
కలలకి ప్రేమలేఖలు వ్రాయమని.
కవితలకి ఊహల రంగులు వేయమని.
కవితలు నాకు చెపుతున్నాయి.
© Meenuu