...

1 views

ఆ క్షణం ఎప్పుడూ...?
ప్రియమైన రామ్ కీ...
మీరు ఎలా ఉన్నారని అడగాలి అని ఉన్న అడుగను... ఎందుకో తెలుసా.... నా అక్షరాలు చేసే సమయానికి మీరు నవ్వుతూ ఉంటారనే నమ్మకం...
ఏమిటోనండి రాము గారు... మీకోసం ఉత్తరం రాయడం మొదలెట్టానా.... ఆ ఓనమాలు వరుసలో వచ్చి పోటీపడుతున్నాయి...
మరీ... గొంతుక దాటని మాటని మీకు చెప్పాలంటే.. కష్టమే... అయిన తప్పదుగా... నాలో ఉన్న ప్రేమని...ఆ పువ్వులతో పోల్చి చెప్పనా... లేదంటే ఆ వెన్నెలతో అద్ది చూపనా.... అలా చూడు నీ నవ్వులను ఆ హరివిల్లు ఎత్తుకెళ్లి నింగిలో దాచేసింది.... నువు మాట్లాడుతున్నప్పుడు ఆ తేనెటీగలు నీ మాటలని తీసుకెళ్ళి తేనెపట్టు లో అంటిస్తున్నవి...
అటు చూడు ఆ ఆమని సైతం వసంతం నువ్వంటున్నవి....
రాము గారు... మీ పేరు తలచుకోగానే.... మన తోటలో మల్లెలు పక్కున నవ్వి పరిమళాల స్పర్శ నీ పంపుతున్నవి నీ జవాబుగా... ఏమి చెయ్యను చెప్పు... నువ్వేమో ఆ హిమ శిఖరాన...
ఈ ఉత్తరం అందగానే... నీ ప్రేమ నీ ఆ కనులకి అంటించి మరీ చదువు... ఎందుకంటే... నీ కనులలో నిలిచిన రూపం నాదేగా...
నీ జవాబుకై ఎదురే చూస్తూ...
నీ సీతా...💗