...

11 views

ఓ నాన్న..!
చిరునవ్వు చెదరనివ్వవు, కన్నీరు రానివ్వవు
బాధ్యత బరువుల మోతలో కృంగిపోయినా....
సంసారసాగరంలో మునిగిపోయినా...
కోపాన్ని,బాధని కనపడనివ్వవు.
లేమి ని తెలియనివ్వవు,ప్రేమను తరగనివ్వవు..
కష్టాన్ని ఇష్టంగా కౌగలించుకొని
సుఖాన్ని పంచుతున్న త్యాగమూర్తివి నీవు..
సహనానికి,సాహసానికి నిలువెత్తు నిదర్శనం నీవు..
విశాలమైన మనస్సుకు అధిపతివి నీవు...
రెండక్షరాల పిలుపుకే రేయింబవళ్లు కష్టం తెలియకుండా గుండెల్లోనే మోస్తున్న
ఓ నాన్నా
ఏమిచ్చినా నీ రుణం తీరునా!



#dad_love @prathyu
© prathyusha.kaipa(gnanvi)