...

1 views

why caste


నిజంగా కులాన్ని ఎవరైతే నాగరికతకు చిహ్నంగా అనుకుంటూ వస్తున్నారో, వాళ్ళ అసలైన అనాగరికులు. 150 - 200 ఏళ్ళ కిందట ఉన్న outdated అయిపోయిన భావాలతో ఇంకా వాళ్ళు బ్రతుకుతున్నారు అని చెప్పకనే చెపుతున్నారు. అదే నాగరికత అన్న పేరుతొ వాళ్ళ నాయకుడిని నిలపెట్టడం, అట్లాగే మా కులం విద్యార్థులు కాబట్టే ఇది సాధించారు అని చెప్పుకోవడం. అట్లాగే మా తేజాలు అని చెప్పి వీడియోలు, తయారు చేసి యూట్యూబ్ లో పాటలు పెట్టడం. ఇదంతా నాగరికతను చాటుకునే పద్దతి గా భావిస్తారు.

చివరగా కులం పేరు పెట్టుకోవడం అనేది నాగరికత కంటే కూడా మేము పలానా అని చెప్పుకోవడానికి ఇష్టపడే ఒక ప్రక్రియ. దాని వలన మనుషులు కొంత బలాన్ని కూడకట్టుకోవాలని అనుకుంటారు, లేదా మేము పలానా కులానికి చెందిన వారం అని గర్వంగా చెప్పుకోడానికి తగిలించుకుంటారు. అట్లాగే కొంత మంది ఒక ఇన్సెక్యూరిటీ తో కూడా భావం తో మేము ఏ మాత్రం తక్కువ కాదు అన్న ఒక భావాన్ని ప్రదర్శించడానికి కులం పేరు తగిలించుకుంటారు.

అట్లాంటి నాగరికులను కొన్ని ప్రశ్నలు గట్టిగా అడిగితె వాళ్ళ దగ్గెర సమాధానం కూడా ఉండదు ... ఏంటి కులం గొప్పతనం అని ఇప్పడికీ నాకు అర్ధం కాదు .. ఎం నేర్చుకున్నాం కులం నుంచి మనము ? రోజు పంది లాగ తింటారు ఇలాంటి వారందరు, అది పండించే రైతు కులం ఏంటో అడిగి తింటున్నారా ? .. అట్లాగే వైద్యం చేసే డాక్టర్ కులం ఏంటి అని అడిగి మందులు రాయించుకుంటున్నారా ? అట్లాగే సరిహద్దుని కాపు కాసే సైనికుడు తమ కులం వాడు కాకపోతే కాపలా కాయడం మానెయ్యి, వేరే వాళ్ళ చేతుల్లో మేము బానిసలుగన్నా బ్రతుకుతాం కానీ నీ రక్షణ లో మేము ఉండము తప్పుకో అని చెపుతున్నారా ? అట్లాగే చదువు చెప్పే ఉపాధ్యాయుల తమ కులం వరకు కాకపోతే క్లాస్ అటెండ్ అవ్వకుండా ఉంటున్నారా ? కులం పేరుతొ మాత్రమే మీకు గుర్తింపు వస్తుంది అంటే, మీ 70 ఏళ్ళ జీవితం లో ఒక మనిషిగా మీరు సాధించింది ఏంటి అని ఎప్పుడన్నా ఆలోచించారా ?? అంటే మనకు అనుకూలంగా ఉండేవాటిలో కులం చూస్తారు అన్న మాట, లేకపోతె సర్దుకుపోతారు.. శభాష్ ..

దీని గురించి ఆలోచిస్తూ ఉంటె 5000 సంవత్సరాలు కింద ఒక మహానుభావుడు రాసిన కథ గుర్తుకు వచ్చింది. మహాభారతం లో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేస్తుంటే ఒక కిరాతుడు వచ్చి, అర్జునుడి మీదకు వస్తున్న అడవి పందిని ముందు బాణంతో కొడతాడు. కిరాతుడి మధ్యన, అర్జునుడి మధ్యన వాగ్వాదం జరిగినప్పుడు, తను అర్జునుడిని అని గర్వంగా చెప్పుకుంటాడు. అప్పడు కిరాతుడు " నీకు ఈ అహంకారం దేని వలన వచ్చింది, నీ గురు వలన ? లేదా నీ వంశం వలనా ? లేదా గొప్ప ధనుర్ధారివనా ? అది గురు వలన అయితే వారికీ నేను ప్రణామం చేస్తున్నాను, భారత వంశం తో పుట్టడం వలన గొప్పవాడివి అయ్యావు అంటే అందులో నీ గొప్పతనం ఏ ముంది ? అదే నువ్వు గొప్ప ధనుర్ధారివి అనుకుంటే నాకు కూడా ఆ గొప్పతనం ఏంటో చూపించు అని అంటాడు. మహాభారతం యదార్ధంగా జరిగింది అనుకోవడానికి మన దెగ్గర సాక్షాలు ఉండకపోవచ్చు .. ఇది కథ అనుకున్న కూడా వ్యాస మహర్షి లాంటి ఒక గొప్పవాడు ఇలాంటి ఒక కథని 5000 సంవత్సరాల కిందట రాయగలిగాడు అంటే, మనము ఎంత వెనకబడి ఉన్నామో ఇక్కడే అర్ధం అవుతుంది.© director.gopikiran