...

0 views

సమయస్పూర్తీ బలమై
ఏ బలమని చెప్పాలి బలాల గూర్చి చెప్పాలంటే ఎన్నో బలాలు.. అందులో ఏదని చెప్పమంటారు కొంత వయసు వరకు తొడండేది కండ బలం.. ఆపదలో ధైర్యాన్నిచ్చేది గుండె బలం అన్ని వేళల్లో వెంటుండేది మానసిక బలం జీవితంలో సమయ సందర్భాలను బట్టి ఆయాబలాలను ఉపయోగించుట తప్పదు.. కష్టాలకి ఎదురీదడం తప్పదు మనిషి పోరాటానికి సంఘర్షణ తప్పదు.. అన్నిటికంటే ముఖ్యమైనది మానసిక బలం దానిని సక్రమంగా ఉపయోగించుకుంటే కాస్త చావు కూడా వెనకడుగు వేస్తుంది. బలాలకంటే కూడా మించినది సమయస్ఫూర్తీ .. మొన్నీ మధ్యలో ఒక ఇంట్లో చిన్నిపాపాయి ఒక 10 సంవత్సరాల అమ్మాయి అంతలోనే కోతి వచ్చి పాయిని లాక్కేళ్తుంది వెంటనే ఆ పెద్దపాప ఫోన్ తీసుకొని
Alexaa కుక్కలా అరువు అన్న వెంటనే అరుపులు రాగానే కోతి పాపాయిని వదిలి పారిపోయింది, అంటే ఆ పాప కుక్కవైరం అనేవిషయం తెలిసి ఉండింది కదా.. ఆపదలో ఆదుకున్నది సమయస్ఫూర్తీ ఆ పాపకి ప్రభుత్వం నుండి ఎన్నో ఆఫర్స్ లభించాయి .. ఈ సీనును మీరు కూడా చూసే ఉంటారు .. మనిషి జీవితంలో అన్నీ అవసరాలే అవకాశాన్ని బట్టి మారుతూ ఉంటాయి..
సంపంగి బూర✍️