...

1 views

చందమామ🌕
ఏ దారిలో నువ్వొస్తావో అని
వెతుకుతున్నా ప్రతిదారిని.....
ఏ పువ్వులో నీ చిరునవ్వు ఉందో అని
పలకరిస్తున్నా ప్రతి పువ్వుని....
వీచే గాలి నీ చల్లని అడుగుల సవ్వడి
వినిపిస్తుందేమో అని వింటున్నా గాలి అలికిడిని...
తీర్చిన బొమ్మ లాంటి చక్కని నీ రూపు....
పైర గాలి లాంటి చల్లని మనసు....
చురకత్తుల్లాంటి చూపులు....
బాణం కన్నా పదునైన మాటలు.....
నీవు నా కలవై వస్తానంటే
ఆదమరచి నిద్రించనా...
పున్నమి చందమామ లా దర్శనం ఇస్తానంటే..
వెన్నెల్లో చిన్న పిల్లాడిలా నేనుండిపోనా....
నా అందాల చందమామతో ఊసులాడుకోనా....!!!
© Dinesh muddada