...

8 views

మరో అవకాశం పార్ట్ -4
తను సాయంత్రం పూట తీసుకున్న
ఫ్రెండ్ పెళ్ళి కార్డు ...తీసీ వధూవరులు.
పరస్పరం చూసి ఓ బలహీన నవ్వు నవ్వి.....

స్నానం చేసి, బాగా రెడీ అయ్యి,
హాలులోకి వచ్చి....
నాన్న...నా ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్న,
అమ్మ నువ్వు జాగ్రత్త.. అంటూ ఉంటే
నాన్న మరి నీ.... ఆయనింకా పూర్తిగా అనలేదు....
జరగని వాటిని గురించి ఆలోచించడం
ఎందుకు. అని.. బయటకు కదిలాడు..
..........

బైక్... స్టార్ట్ చేసి..
....... ఫ్రెండ్ కోసం.. గిఫ్ట్ షాపు లో
గిఫ్ట్ కొని....
ఫ్రెండ్ ఇంటికి బండి తిప్పాడు....

నాలుగు సందులు తిరిగిన తర్వాత
ఓ మేడ దగ్గర బైక్ ఆపి....
ఇంట్లో కెల్లాడు,
అప్పటి కే
ఏర్పాట్లు పూర్తి అయ్యాయి
సరిగ్గా తను ముహూర్తం వేళకు వచ్చాడు..... పెళ్ళాయక ఫంక్షన్ లో
తను నందిని ని చూసి అక్కడే ఉండి పోయాడు... ఇద్దరి కళ్ళు చూసుకున్నాయి కానీ
కలవలేదు....
గిఫ్ట్ ఇచ్చేందుకు ముందుకు వెళితే..
అక్కడ ఉన్న నందిని చూసి చూడగానే
దూరంగా వెళ్లి పోయాడు... చంకలో బిడ్డతో భర్తను కూడా వెంటబెట్టుకొని
వచ్చిన తనని చూడలేక పోయినా
మనసు మాత్రం ఆరాటపడుతూ ఉంది....
గిఫ్ట్ ఇచ్చి, ఫోటో దిగి, భోజనానికి
కదిలాడు శివ....
అందరి తో పాటు.. తనూ ఓ వరుసలో కూర్చున్నాడు...
అరిటాకు ను తుడుస్తూ,
ఆలోచనలో పడ్డాడు..
కొద్ది సేపటికి ఎదురుగా ఓ గొంతు విని
ఈ లోకంలోకి వచ్చాడతను,
తన ముందు ఓ అందమైన అమ్మాయి తన కురులు గాలికి కదులుతూ ముఖం సరిగ్గా కనపడకుండా ఉంది..
మిస్టర్.. రైస్ అంటుంటే
ఆ.. ఆ..
అన్నాడు.. ఆమె అతని వాలకం చూసి
నవ్వుతూ వడ్డించి వెళుతుంది..
ఆ తర్వాత అదే అమ్మాయి...
సాంబారు, చారు, పెరుగు ఇలా
అన్ని తానే స్వయంగా వడ్డిస్తూ వచ్చింది....

వేరే వాళ్ళు ఎవరూ లేరా అన్నట్టుగా అతను ఆమెను చూసాడు.....
ఆమె నవ్వుతూనే ఉంది...
అతనికి అంతు చిక్కలేదు
............

మరుసటి రోజు ఉదయం.. స్నానం చేసి ఆఫీసుకు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ చోట
తనకు సర్వ్ చేసిన అమ్మాయి
కనిపిస్తుంది....
అతను ఆశ్చర్య పోతూ కారణం అడుగు తాడు
కొత్తగా కొత్త కంపెనీ లో జాబ్ దొరికిందని బస్సు రాలేదని ఆమె
చెబుతుంది.. అడ్రస్ చెప్తే అతను దిగబెడతానని అంటాడు..

అందుకు ఆమె ఆలోచించి... సరేనంటుంది...
ఆఫీసు కు దగ్గరగా వస్తుంటే
ఏదో ఒక పని ఉందని తను మధ్యలోనే దిగిపోతుంది...

తన ఆఫీసు పక్కనే ఉండటంతో
అతను..ఆఫీసుకు వెళ్ళాడు..
కొద్ది సేపటికి m.d అందరి ముందు వచ్చి. ..కొత్త ఎమ్ప్లయ్ ని అందరికీ
పరిచయం చేస్తూ ఉంటే శివ ఆ గందరగోళం ఏమిటో అర్థం కాక క్యాబిన్ లోంచి బయటకి వచ్చి చూడగా అది ఎవరో కాదు సాక్షాత్తు తన ఫ్రెండ్ పెళ్ళి లో వడ్డించిన ది,
ఇప్పుడు తన బైక్ ఎక్కిన అమ్మాయి
తనే ..

ఆమె కూడా అతన్ని చూసి చూడగానే ఆశ్చర్య పోతూ
ఎమ్ డి కి జరిగిన దంతా చెప్పగానే
what a co_incidence అంటూ ఆశ్చర్య పోతూ Bye THA BYE మిస్టర్ శివ
తను మిస్ సురభి.. నీ కొత్త అసిస్టెంట్ డైరెక్టర్, అంటూ పరిచయం చేసిన తర్వాత ఇద్దరూ కలిసి కరచాలనం చేసుకుంటారు... ఏమి తెలియనినట్టు,


కొన్ని రోజులు గడిచాయి...
సురభి చాలా పద్ధతి గలది...
ఏ ఒక్క క్షణం వృధా కాకుండా చూస్తుంది...
అందువల్ల శివ వర్క్ కవర్ అవుతూ ఉంటుంది...

అనుకోకుండా తను ఆమెపై సదాబిప్రాయాన్ని ఏర్పరచు కుంటాడు
ఆమె అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది...
ఆమె ఉద్దేశం వేరు,
ఆమె ఆశయం వేరు,
...............................
..............................

రోజు లాగానే ఆ రోజు తను ఆఫీసు కెలతాడు.. ఆరోజు ఆమె లీవులో
ఉంటుంది...
అతనికి చాలా కోపం వచ్చింది
కారణం చెప్పలేదని,
తన అనుమతి తీసుకోలేదని, ........
............................................

మరుసటి రోజు ఉదయం వచ్చి రాగానే
కరెంటు షాక్ తిన్న కాకి లా
ఆమెపై గంతులు వేసాడు...
తను సహనం వహించి
సర్ది చెప్పేందుకు సిద్ధంగా ఉంది...

వాళ్ళింద్దరీ వాగ్వాదం బయట నుంచి చూస్తే భార్య, భర్త ల పోరులా
తలపిస్తోంది...

సద్దుముణిగే సరికి ఇద్దరూ అలసి పోయారు...

ఆమె అందాన్ని అతను ఏనాడు పట్టించుకోలేదు,
అతని కదలికలు అన్ని ఆమె గమనిస్తూనే ఉంది...
అతన్ని ఆరేళ్ల క్రితం నుంచి ప్రేమిస్తోంది
తను......

నందిని అన్న మాటలు కు
ప్రత్యక్ష సాక్షి ఆమె,
ఆ రోజు నందిని
శివతో "క్యారెక్టర్ కోసం అతీ,గతీ,లేని నీలాంటి వాళ్ళని ప్రేమించాలంటే నాకు
కంపరంగా ఉంటుంది..

సొంత చెల్లెలు కావున పెళ్ళి లో
బాగోదు అని స్నేహం చేస్తే,
దాన్ని నువ్వు advantage తీసుకుంటే
ఎలా???
అయినా దగ్గర వాడివి కాబట్టి
మెడ పట్టుకొని గెంట లేకున్నా
అంటుంటే అతని కోపం
టేబుల్ మీద పడి నాలుగు
ముక్కలైంది... ఆడపిల్ల అని ఏమీ
అనకుండా అక్కణుంచి వచ్చేసాడు
శివ... ఇదంతా పక్కింటి నుంచి
చూస్తూ ఉంటుంది సురభి...

ఓ రోజు తొందర పడి సురభి..
శివతో తన విషయం చెప్పింది...

..................
.................................
............................
..........(ఇంకా ఉంది)..........
.........................by......... govind@........
...................




















© All Rights Reserved