...

2 views

ప్రేమ ప్రయాణం ( ఎపిసోడ్ - 3 )
( సాయంత్రం అయ్యింది. దీపికా మరియు రాజేష్ పక్క పక్కనే కూర్చున్నారు. రాజేష్ ని చూస్తూ ...)
దీపికా: రాజేష్! పాటలు ఏమైనా వింటావా?
(అంటూ తన ఇయర్ ఫోన్ ఒకటి తనకు ఇస్తుంది. రాజేష్ మొహమాటానికి వద్దన్నాడు . కానీ చివరికి తీసుకున్నాడు. ఆ పాటలు వింటూనే నిద్రలో జారుకున్నాడు . దీపకా కూడా కిటికీ అద్దం లో ప్రకృతి అందాలు చూస్తూ పడుకుంది. శివ వాళ్ళను చూస్తూ 'వీళ్ళ పనే బాగుంది .పక్క పక్కన కూర్చోని ఎంచక్కా పాటలు వింటూ పడుకున్నారు.')
(కొంతసేపటికి తరువాత టీ.టీ. వీళ్ళ కంపార్ట్మెంట్ కి వస్తాడు. టీ.టీ రావడం తో శివ పక్కన వున్న ఆ కుర్రవాడుకి చాలా భయం వేస్తుంది. తనుకు చెమటలు పడతాయి. అది చూసిన శివ ఆ కుర్రవాడు తో..)

శివ: ఏరా భయపడుతున్నావు ఎమైంది?

కుర్రవాడు: అన్న ! నా పర్సు ఎక్కడో పడిపోయింది . ఇప్పుడు టీ.టీకి ఫైన్ కట్టాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు.

శివ : అయ్యే. ఇప్పుడు మరి ఎలా అయితే.?
( అలా వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుండగా టీ.టీ వచ్చాడు.)

టీ.టీ: బాబు టికేట్ చూపించండి .
( అని అడుగుతున్నాడు. దీపికా, రాజేష్ నిద్రలేచారు. రాజేష్ కళ్ళు ఎర్రబడ్డాయి. దీపికా విసుగ్గా టీ.టీ నుంచి చూస్తూ మనసులో తిట్టుకుంది. వాళ్ళ వాళ్ళ బ్యాగ్ లో నుంచి జేబులో నుంచి టికెట్ తీసి టీ.టీని చూపించారు. )

టీ.టీ: బాబు నీ టికెట్ చూపించలేదు?
(అని ఆ కుర్రవాడు కి అడిగాడు. )

కుర్రవాడు: సార్ నా టికెట్ లేదు సార్. నాది జనరల్ కంపార్ట్మెంట్ . జనరల్ లో అస్సలు కాళీ లేదు సార్ ఇంకా నా హేల్త్ బాగోలేదు సార్. నెక్స్ట్ స్టేషన్ లో నేను దిగిపొయాను ‌సార్.
‌‌ ( చాలా నెమ్మదిగా మాట్లాడుతాడు.)

టీ.టీ: నెక్స్ట్ స్టేషన్ వచేసరికీ రెండు గంటలు పడతది. ఫైన్ 200 అయిన కట్టు లెదా జనరల్ కైనా వెళ్ళిపో.

కుర్రవాడు: సార్ నా దగ్గర 50 వుంది సార్.
( అలా టీ.టీ కి కుర్రవాడి మధ్య వాదన నడుస్తుంది. ఇంతలో దీపికా..)

దీపికా : టీ.టీ సార్ తన ఫైన్ నేను కొడతాను తనకు బెర్త్ ఇప్పించండి .
(అంటూ దీపికా తన దగ్గర ఉన్న 200 టీ.టీ కి ఇస్తుంది. టీ.టీ అతని కి బెర్త్ ను చూపిస్తాడు. కుర్రవాడు దీపికా ని ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక రెండు చేతులు జోడిస్తాడు. దీపికా మంచితనాన్ని చూసి మురిసిపోయాడు. పరిచయం లేని వ్యక్తులకే ఇంత సాయం చేసిందంటే . తానను చేసుకునేవాడు చాలా అద్రుష్టవంతుడే. ఆ అద్రుష్టవంతుడు నేనైతే ఇంకా బాగుంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు.)
(రాజేష్ తను సీటు దగ్గర కి వెళ్లి కుర్చునాడు. )

దీపికా : రాజేష్ నాకొక డౌటూ . ఏమనుకోనంటే అడుగుతా.

రాజేష్ : అడుగు దీపికా ‌..

దీపికా : అదీ. ..నీవు ఉద్యోగం ఎందుకు వదిలేసావు ? అసలు ఏం జరిగింది?

రాజేష్: నాకు చాలా చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది.నేను చదువు లో బాగా రాణించడం వల్ల నాకు 19 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చింది. 20 ఏళ్ళకే బీ.టేక్ పూర్తి చేసా. నాకు మంచి కంపినీ లో ఉద్యోగం వచ్చింది. పని ఎంత పెద్దదైనా సరే నేను చిటికెలో పరిష్కరించగలను. నేను నాలుగేళ్ల గా ఆ కంపెనీ లో పని చేయటం వల్ల నా మీద వున్న నమ్మకంతో మేనేజర్ గారు నాకు పెద్ద ప్రమోషన్ ఇవ్వాలనుకున్నారు. మేనేజర్ భార్య కూడా ఆ కంపెనీ లో నే మూడేళ్ల గా పనిచేస్తుంది. తనకే ప్రమోషన్ ఇవ్వాలంటూ తన భర్తకు మండీపడిందీ. చివరికి ఆ ప్రమోషన్ నాకు వచ్చింది. కాని మేనేజర్ భార్య మాత్రం నా మీద చాలా కోపంగా వుండేది. కొత్త గా వచ్చిన వాళ్ళకి నా మీద చాడీలు చెప్పేది. కొన్ని రోజుల తరువాత మేనేజర్ గారు నాకు కంపిని సీక్రెట్ ఫైల్ నాకు ఇమ్మని వాళ్ళ భార్య తో చెప్పారు. కానీ వాళ్ళ ఆవిడ మరిచిపోయింది. మరుసటి రోజు మేనేజర్ వచ్చి నా పైన కోపగించుకున్నారు. నాకు ఫైల్ ఎవ్వరు ఇవ్వలెదని అన్నా కూడా మేనేజర్ వాళ్ళ భార్య ను వెనకేసుకొని వచ్చారు.' నా మీద ఎవరికైతే ఎక్కువ నమ్మకం వుంటుందో వాళ్ళ కోసం నేను ఏమైనా చేస్తాను . కానీ నా మీద ఎవరైతే నమ్మకం ఉండదో, నన్ను మోసం చేయాలని చూస్తారో , చేయని తప్పుని నా మీద నింద వేస్తారో‌ వాళ్ళ మోహాన్ని జీవితంలో చూడను.'
ఇదే నా కేరక్టర్ . మేనేజర్ నా పై నింద వేయడం వలనే నేను ఉద్యోగానికి రాజీనామా చేసేసాను.
( దీపికా మనసులో నేను చెప్పిన విషయాలన్ని అబద్దమే ,పేరు తప్ప. తనకు తెలిస్తే ఈ బెర్త్ కాళి చేసి వెళ్ళిపోతాడో ఏంటో. నిజం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది.)

రాజేష్ : ఏంటి దీపికా అలా ఆలోచిస్తున్నా ఎమైంది.

దీపికా: ఆ! ఏం లేదు.
( దీపికా నిజం చెప్తుందా లేదా అనేది నాలుగో భాగం లో తెలుసుకుందాం..)












© sai@333