...

1 views

ప్రేమ ప్రయాణం (ఎపిసోడ్ -2 )
( వాళ్ళు భోజనం ముగించుకున్నారు. దీపికా రాజేష్ కి ఉద్యోగం ఎందుకు వదిలేసాడన్న దాని పై ప్రశ్న అడగడానికి సిద్ధం అవుతుంది. ఇది ఎపిసోడ్ 1 లో జరిగిన కధ.)
(దీపికా ప్రశ్న వేస్తుండగా ఇంత లో ఒక కుర్రవాడు వచ్చి ...)

కుర్రవాడు: అన్న నా హేల్త్‌ ఏమి బాగోలేదు. నాది జనరల్ కంపార్ట్మెంట్ . జనరల్ లో చాలా ఎక్కువ మంది వుండటం వల్ల నేనిక్కడికి వచ్చేసాను. మీ పక్కన కూర్చో వచ్చా?

శివ: కూర్చో తమ్ముడు.
(అని శివ పక్కన చోట ఇస్తాడు.)

కుర్రవాడు: చాలా థ్యాంక్స్ అన్నయ్య.

శివ : నాకు థ్యాంక్స్ ఏమీ అక్కర్లేదు గాని నీ స్టేషన్ ఎక్కుడ?

కుర్రవాడు: నాది ......

శివ: ఇంక మూడు స్టేషన్స్ దాటాలి.
(అలా శివ మరియు ఆ కుర్రవాడు మాట్లాడసాగారు.)

(ఇంతలో స్టేషన్ వచ్చింది. ట్రైన్ స్టేషన్ లో చాలా సేపు ఆగుతుందని తెలిసి...)

రాజేష్: అరేయ్ మామా ! స్టేషన్ వచ్చింది రా నీకేమైనా తేవాలా ?

శివ: నాకేం వద్దురా. దీపికా కి ఎమైనా కావాలేమో అడుగు..

రాజేష్: దీపికా, ఏమైనా తేవాలా?

దీపికా: నో థ్యాంక్స్...

రాజేష్: శివ బాటిల్ అందుకో. నేను వాటర్ ఫిల్ చేసి తెస్తాను.

దీపికా: రాజేష్! ఏం అనుకోకపోతే నా బాటిల్ కూడా వాటర్ ఫిల్ చేసి తెస్తావా?

రాజేష్: ఏం పర్వాలేదుండి ఇటు ఇవ్వండి.
(అంటూ బాటిల్స్ తీసుకు వెళ్ళాడు. బాటిల్స్ నింపిన తరువాత . అలాగే రెండు చాయ్ లు తీసుకొచ్చాడు.)
(ట్రైన్ కదిలింది)
( రాజేష్ శివ దగ్గరకి వచ్చి ..)

రాజేష్: ఇదిగో రా బాటిల్ . దీపికా ఏది రా?

శివ: వాష్ రూమ్ కి వెళ్ళిందినుకుంటా..

రాజేష్: తను వస్తే ఈ టీ తనకు ఇచ్చి రా.

శివ: నాకిస్తున్నావేట్రా ... నువ్వే తెచ్చావు , నువ్వే ఇవ్వచ్చు కదా .

రాజేష్: నాకివ్వటానికి మొహమాటం రా .

శివ : ఇంత మొహమాటం ఉంటే తేవడం ఎందుకు? చెప్పు..
(అలా వాళ్ళు మాట్లాడుతుండగా దీపికా వచ్చింది. రాజేష్ టీ తన వెనుక పెట్టి దాచాడు.)

శివ: దీపికా రాజేష్ నీ కోసం ఎదో తెచ్చాడు.

దీపికా: ఏం తెచ్చాడు.?

శివ: వెళ్ళి వాడ్నే అడుగు..

దీపికా: రాజేష్....!
( అని అంటుండగా.)

రాజేష్: దీపికా అది... నీ కోసమే... చాయ్ . తీసుకొచ్చ. ఇదిగో.
( అని చాయ్ నీ తనకు ఇచ్చాడు.)

దీపికా: అయినా నేను చాయ్ ని తెమ్మని చెప్పలేదే..

రాజేష్: నేను ఓ స్నేహితుడిలా ఇస్తున్నా తీస్కోండి.
(దీపికా రాజేష్ తెచ్చిన చాయ్ ను తీసుకుంటూ తనకు కృతజ్ఞతలు తెలిపుతుంది.)
(రాజేష్. వాష్ రూమ్ కి వెళ్తాడు . శివ వాటర్ తాగుతూ రాజేష్ సీటు మీద వాటర్ పడేశాడు. రాజేష్ తిరిగి ‌వచ్చి సీటు చూసేసరికీ , సీటు తడిగా వుంది.)

శివ: సారి రా మామ నీళ్ళు తాగుతుండగా పడిపోయింది.

రాజేష్: సరె ఏం పర్వాలేదులే. త్వరగా ఆరిపోద్ది. అందాకా దీపికా పక్కన కూర్చుంట ఎలాగో ప్లేస్ కాళియే కథా.
( దీపికా పక్కన కూర్చున్నాడు. కూర్చున్న ఐదు నిమిషాల్లో ఒక లావుపాటి వ్యక్తి వచ్చి రాజేష్ పక్కన కూర్చున్నాడు. తాను ఎంత లావు వున్నాడంటె దీపికా లాంటోలు ఇద్దరు పడతారు. వాడు కూర్చునే ప్లేస్ లో. రాజేష్ దీపికా మథ్య కాళి లేకుండా పోయింది. రాజేష్ దీపికాని టచ్ చెయ్యగానే తన గుండె రెండింతల వేగం పెరిగింది. తాను చేతులు వనికిపోయాయి. నోటి నుంచి మాట రావటం కష్టంగా అనిపిస్తుంది. ఇది రాజేష్ పరిస్థితీ. రాజేష్ పరిస్థితీ ని తెలిసిన శివ ఆ లావుపాటి వ్యక్తి తో....)

శివ: ఓయ్.. మీ సీట్ నెంబర్ ఎంత?

లావుపాటి వ్యక్తి : నా సీటు నంబర్ ఇదే అందుకే ఇక్కడ కూర్చున్న తప్పేమంది.

శివ: ఓకే, గానీ మీ వల్ల వాళ్ళిద్దరు ఫ్రీ గా కూర్చోలేకపోతున్నారు.
(అలా వాళ్ళు హిందీలో మాట్లాడుతూ పరిచయం అవుతారు. ఆ వ్యక్తి కుడా కొంచెం జరుగుతాడు.)
( రాజేష్ అయితే ఒళ్ళంతా వేడెక్కి పోయింది. చిన్న చెమటలు కూడా పట్టాయ్. అది చూసిన దీపికా రాజేష్ తో....)

దీపికా: రాజేష్ ! ఒళ్ళేంటి వెడెక్కసింది. ఇబ్బంది గా ఉందా. ఏం బయపడకు. నీ వల్ల నాకు ఇబ్బందేం లేదు.
( కాని ఎవ్వరికీ తెలియని విషయం ఎమైనా ఉందంటే అది. రాజేష్ దీపికాని తాకగానే ప్రేమ లో పడిపోయాడు. దీపికా కూడా తన యొక్క మొహమాటానికి, అమాయకత్వానికి , తన మాటలకు పడిపోయింది.)
( ఈ ప్రేమ ప్రయాణం రైలు ప్రయాణం లో కొనసాగుతుంది.................💕)

(wait for episode 3 )♥️♥️♥️








































© sai@333