...

0 views

పిడికిలి
జీవితం అనేది ఒక నిరంతర రోజుకో యుద్ధం బ్రతుకే పోరాటం ఒక యుద్ధం ముగిసేలోపు మరొకటి సిద్ధం. వెనుకంజ వేయకుండా పోరాడుతూ సాగిపోవడమే జీవితం. తల్లి జీవితంతో పోరాడుతూ పాపకు జన్మనిస్తుంది. అదే పాపకు మద్దతు అంటూ తాను కూడా పిడికిలితో జన్మించి లోకంలో అడిగిన నాకు నా పిడికిలి పోరాటానికి సిద్ధం అని
చెప్పకనే చెబుతూ ,
కన్నీటి సిరాతో మండే గుండెల వెలుగుల్లో చరిత్రను తిరగ వ్రాసే చరిత్రకారులం దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే ముడిసిన పిడికిలి మనుషులం,
పిడికిలి బిగించి పోరాటం సాగించి ఎన్నో ఉద్యమాలలో, ఎందరో సమయోధుల ప్రాణత్యాగాలు ఫలితంగా భారతావని బానిస సంఖ్యలను తెంచుకుంది స్వేచ్ఛ ఊపిరిల్లో జీవిస్తుంది
సంపంగి బూర✍️