...

9 views

మన మాతృభాష
శిథిలాల్లో పుట్టి , త్రిలింగ పదము నుండి. జారిన బీజం హిందూ దేశ మట్టిలో
మహావృక్షంగా పెరిగింది తెలుగు భాష
అందమైన అక్షరాలను శాఖలుగా చేసుకొని
అంతులేని పదాలను ఆకులుగా పరుచుకొని
సాటిలేని మకుటాలైన కవులను
పువ్వులుగా పూసేలా చేసింది
కోటి ఫలాలను విద్యలుగా పంచింది
మన మాతృభాష తెలుగు
అమ్మ ప్రేమను కమ్మగా తెలిపేది తెలుగు,
నాన్న బాధ్యతను ,బరువును
భావయుక్తంగా చెప్పేది తెలుగు
గురువు నేర్పే పాఠంలో
గమ్యాన్ని చూపేది తెలుగు
సహస్రనామాలకు పుస్తకం తెలుగు
ఎన్నో మహా గ్రంథాలకు
పురాణాలకు నాంది తెలుగు
భారతదేశపు అఖండ
ఖ్యాతికి సోపానం తెలుగు
-ఆనం ఆశ్రిత రెడ్డి (గంగ)
© Anam Aasritha