...

1 views

ఓయ్..నిన్నే/ మంటలు
జీవించడానికి కోరలేదు నిన్ను,
నిన్ను కోరడానికే జీవిస్తున్నాను నేను.
ప్రేమ కన్ను నీవైతే ఆ కంటికి కాపలా నేను...
ఆగని మనసు ఆవేదనలకు.
నిలయం కాకూడదని అలా
ఓయ్... నీ ప్రేమను పొందడానికి,
నీతో జీవించడానికి నా అహంకారాన్ని అమ్ముకున్నాను.
జీవితమా...
*****
కాలబెట్టేశారు అరచి వరిగిన అశృవులను..
ఊదేశారు ఇనప గొట్టంతో
వేదనలు నిండిన బాధలను గాలిలో
హే అగ్ని దేవతా
చేసి వదిలేయ్ పసిడి
మమ్ములను క్షణమైనా తరించుతాము..
చేసి వేయి బస్మము
కాదనుకుంటే బూడిదను...
రోజు రోజు భరించము ఈ వేదనలు..
భగభగ మండే మంటతో
పొగలో తిరగాడుతూ
ఒళ్లంతా భగా భగలే
నేలపై ఉండలేకపోతున్న మేము అందుకోలేకపోతున్నాము నింగిని..
నేనూ నా భావాలు
సంపంగి బూర✍️