...

1 views

చెప్పవే చిరుగాలి
చెప్పవే చిరుగాలి
చల్లగా యెద గిల్లి
ఎక్కడే వసంతాల కేళీ
చూపవే నీతో తీసుకెళ్లి ..
ఈ పాట చాలా బాగుంటుంది.
నాకు చాలా ఇష్టమైనది
ఇంతే నాలుగు లైన్స్ తప్పరావు..
ఆశలను మడిచి అలా తీసుకెళ్తుంటే
సంద్రములో కదిలే అలలు ఊరిస్తుంటే,,
ఉష్ణ తాపాన్ని తాకలేక కోరిక లేవో
శీతల పవనాలను తాకాలని,,
ఊహించే ఉత్ప్రే రకాలు
ఉద్దేశాలను మార్చుతుంటే,,
కనుల నిండా ప్రకృతి అందాలు
చిమ్ముతుంటే మళ్లీ జన్మలో కూడా
నేనై జన్మించాలని
అనుభవం ఊరించగా...
పెరుగు తీద్దామని ఫ్రిడ్జ్లో తలదూర్చిన
క్షణంలో ఫ్రిడ్జ్ నుండి వచ్చేసి శీతలం
ఏ తీరానిదో అంటూ
నా ఆలోచనలో తట్టిన అక్షరాలను
మీ ముందు ఉంచాను..
సంపంగి బూర✍️