ఓటు తో వేటు
ఓటు తో వేటు
___________
పరికించు ఓ మారు
ఆలోచించు పలుమార్లు
వజ్రాయుధమైన హక్కును
కలిగినందుకు తనివితీరా
ఆనందించు ఆస్వాదించు
అలసత్వంతో ఆ హక్కును
అసహ్యంగా అంతమొందించకు
అవినీతి పరులకు
అందలమెక్కించకు
విలువైన ప్రజాయుధం
ప్రజాస్వామ్య రథచక్రం
ప్రజల రక్షణ అస్త్రం
చరిత గతిని మార్చేది
భవితకు భద్రత
భరోసా కలిగించేది
అక్రమార్కుల పని పట్టేది
సమాజ హితానికి
హేతువయ్యేది ఓటు
వట్టి మాటలు వినకు
భవిత అంగారం చేయకు
యువత నవశక్తులు
సరియైన పంథాలో
పయనం చేయాలంటే
ఆలోచించు నీ హక్కుకై
ఏరి కోరి ఏంచి
మెచ్చి పట్టం కట్టు
ఒకరిపై...