...

1 views

గతించాను/ క్షణం
గతించాను నేను గడిచిన
ఈ క్షణం లా
గతమే ప్రతీక్షణం
ఆవృతమవుతుంటే
ఎప్పటికైనా
జాగృతమవుదామంటే
గతం వెంబడిస్తుంది
క్షణ క్షణo ప్రతీ క్షణమై..
క్షణం క్షణం ఎదురు చూశా
ఆ క్షణం కొరకు..
క్షణం వచ్చింది కూడా
ఒక్క క్షణం కొరకు,,
ఇపుడు ప్రార్థిస్తున్నా
ఆ క్షణం కొరకు,,
బహుశా మళ్ళీ వచ్చేస్తే
ఆ క్షణం
ఒక్క క్షణం కొరకు.
.. సంపంగి బూర✍️