...

1 views

జీవన పోరాటం
జీవితం
రంగుల కవరులో
చుట్టబడిన
విషాద లేఖ..
మనిషికి బహుమతిగా
దొరికిన
జీవనం
మొదటి కానుక ...
*****
జీవితం ఒక నది ప్రవాహం తీరని కోరికల ఆరని దాహం.. ఓ తీరం సుఖాలైతే మరో తీరం దుఖాలే వీటిని తట్టుకొని సాగిపోవడమే జీవితం జీవన సమరంలో ఎన్నో ఎదురు దెబ్బలు వీటిని తట్టుకొని పోరాటం చేయక తప్పదు.. ప్రాణం ఉన్నంతవరకు మట్టి కాళ్ళ క్రిందే, ప్రాణం పోయాక మట్టి క్రింద మనం ఇదే జీవిత సారాంశం.. నీ జీవితంలో వెలుగు వస్తుందని చేతులు కట్టుకొని కూర్చోకు,నీ చైతన్యం జాగృతిలోంచే వస్తుందని మరిచిపోకు..
సంపంగి బూర✍️