...

4 views

మా మాస్టర్
ఒక స్కూల్ లో రేపు గణిత దినోత్సవం కావడంతో ఆ స్కూల్ వాళ్ళు ఆ స్కూల్ విద్యర్థులకు గణిత శాస్త్రవేత్తల బొమ్మలు గీయడం కోసం చిత్రలేఖన పోటీపెట్టారు. అక్కడ పిల్లలు పెద్దఎత్తున ఆ పోటీ లో పాల్గొన్నారు. ఆరో తరగతి నుండి పది వ తరగతి వరకు దాదాపు అరవై మంది పాల్గొన్నారు. దాని లో అనుదీప్ కూడా పాల్గొన్నాడు. అతడు ఎనిమిదవ తరగతి కి చెందిన విద్యార్ధి చాలా బాగా బొమ్మలు వేయగలడు. అయితే పోటి ప్రారంభం అయింది. అందరు గణిత శాస్త్రవేత్తల బొమ్మలు వేస్తుంటే అతడు మాత్రం తన గణితం మాస్టర్ యుగంధర్ చిత్రపటం వేసాడు. పక్కనున్న వాళ్ళు తన బొమ్మ ను చూసి నవ్వారు, ఎగతాళి చేసారు.
పోటి ముగిసిన తరువాత ఎవరి తరగతి గదులకు వాళ్ళు వెళ్లిపోయారు. అయితే సాయంకాలమున ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అనుదీప్ కి పిలిచాడు. అతడు వచ్చి హెడ్ మాస్టర్ ఎదుట నిలుచున్నాడు. " అనుదీప్ !ఈ రోజు జరిగే చిత్రలేఖన పోటి లో నీవు వేసిన ఆ బొమ్మ మన స్కూల్ యుగంధర్ సార్ లా ఉంది. గణిత శాస్త్రవేత్తల చిత్రపటాలు వేయమంటే ఆయన బొమ్మ వేసావు ఎందుకు ?" అని హెడ్ మాస్టర్ అడిగాడు. " సార్ ఆ మాస్టర్ చాలా బాగా లెక్కలు చేస్తారు అది అందరికి తెలిసిన విషయమే కాని ఆయన నాకు మరియు అందరికి స్పెషల్. నేను ఎడవ తరగతి లో చాలా వీక్ స్టూడెంట్ ని. నేనిప్పుడు ఇంత బాగా చదువుతున్నానంటే దానికి కారణం ఆ మాస్టరే .ఇంకా గణితం లో తప్పు లేకుండ స్పష్టంగా రాయగలరు. చాలా సులువులును నేర్పించారు. చదువు రానివారు ఇప్పుడు ఇంత బాగా చదువుతున్నానంటే దానికి కారణం ఆ మాస్టరే. రాత్రివేళ వాళ్ళ ఊరిలో డబ్బులు ఆశిచకుండా అక్కడ వున్న పిల్లలకు చదువు చెప్తారు. ఇంకా చాలా చేస్తారు. అందుకే ఆ మాస్టర్ బొమ్మ వేసాను " అని అనురుధ్ అన్నాడు. " సరే ...నువ్వు నీ తరగతిలో కి వెళ్ళు " అని శాంతంగా అతన్ని అక్కడనుండి పంపించేసాడు.
కొన్ని క్షణాలు తర్వాత హెడ్ మాస్టర్ కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లో మాట్లాడిన కొంతసేపటి తరువాత తన స్టేఫ్ దగ్గరకు వెళ్లి వాళ్ళ తో " మన స్టేఫ్ ఒక మాస్టర్ ని కోల్పోవాల్సి వస్తుంది . ఆయన పేరు ...... యుగంధర్ సార్. మన గణిత మాస్టర్. ఆయనకి ఈ రోజు బాగోలేదని సెలవు తీసుకున్నారు. ఆయన కి కొద్దిసేపు క్రితమే హార్టేటాక్ వచ్చి మరణించారు."అని బాధతో అన్నాడు. ఆ రాత్రి హెడ్ మాస్టర్ అనుధీప్ చెప్పేది ఆలోచించాడు.
తరవాత రోజు గణిత దినోత్సవం హెడ్ మాస్టర్ స్పీచ్ ఇచ్చారు.విద్యార్ధులందరు ఆయిన స్పీచ్ వింటున్నారు. కొందరు ఈ రోజు గణిత దినము కదా యుగంధర్ మాస్టర్ రాలేదేంటీ అని అనుకుంటున్నారు. గణిత శాస్త్రవేత్త అయిన రామానుజ చిత్రపటానికి దండ వేయడం. తర్వాత తర్వాత ఏం చెయ్యాలో చేసారు. నిన్నటి పోటీ కి ప్రధమ ద్వితీయ బహుమతులు ఇవ్వడానికి సిద్దంగా వున్నారు. చిత్రలేఖన పోటీలో పాల్గొన్న వారిలో కొందరు నాకు బహుమతి వస్తుంది తప్పకుండ అని కొందరు పక్కవాళ్ళ తో చెప్పుకుంటున్నారు. వాళ్ళు అలా అనడంతో అనుదీప్ మాత్రం ' నాకు బహుమతి రాకపోవచ్చు' అని అనుకున్నాడు. రెండవ బహుమతి ఉదయ్ కి వచ్చింది. ప్రధమ బహుమతి విజేత ఎవరంటే అనురుధ్ అని చెప్పడంతో అను లో ఆనందాన్ని కలిగించింది.
వెళ్లి బహుమతి ని అందుకున్నాడు. బహుమతి పట్టుకొని వెళ్లి తన ప్లేస్ కి వెళ్ళి కూర్చున్నాడు. అందరు తన వైపు చూసి చప్పట్లు కొట్టారు. అక్కడ తాను గీసిన బొమ్మ స్టేజ్ మీదకు తీసికొని వెళ్లి కుర్చీ మీద పెట్టారు. "డియర్ స్టూడెంట్స్ మన మాస్టర్ యుగంధర్ నిన్న సాయంత్రం మరణించారు. ఈ రోజు గణిత దినము కనుక ఆయనకు ఈ రోజు వర్ధంతి. " అని హెడ్ మాస్టర్ చెప్పి ఆయనలా ఉండాలని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు . ఆయన మరణించిన వార్త అనురుధ్ కి చాలా బాధ కలిగించింది. ఆ బహుమతి ని తన మాస్టర్ గా భావించి ఆ బహుమతి ని జాగ్రత్తగా ఇంట్లో ఉంచుకున్నారు.
నీతి : మాస్టర్ అనేవాడు చదువు చప్పడమే కాదు విద్యర్థుల హృదయంలో చిరకాలం చెరగని వ్యక్తి గా మారాలి. మంచి ముద్ర పడాలి.
© All Rights Reserved