...

1 views

"శ్రీ కృష్ణ మహా భారతం - 52"
"శ్రీ కృష్ణ మహా భారతం - 51" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 52"

అలా కృష్ణుడిని చూసిన రుక్మిణీ సంతోషంతో పరవశించిపోతుంది. తను పతిగా భావించే ఆ కృష్ణుడికి దగ్గరగా వచ్చి, ఆయన్ని నేరుగా చూడలేక, సిగ్గుపడుతూ తన తల దించుకుని అప్పటివరకూ తన మదిలో పేరుకున్న వేదనంతా సంతోషంగా మారుతుంది.

ఆ సంతోషంతో కార్చే ఆనంద భాష్పాలు కృష్ణుడు యొక్క హృదయ గదులను తాకుతాయి.

శ్రీ కృష్ణుడు ఒక చిన్న చిరునవ్వుతో రుక్మిణీ యొక్క మోముని తాకుతూ ఆమెను ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాడు.
రుక్మిణీ యొక్క ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.
అలా రుక్మిణీ కృష్ణులు ఆ పార్వతీ దేవి సమక్షంలో ఒక్కటవుతారు.

ఇక మరొకవైపు రుగ్ముడి సమక్షంలో విదర్భ సైనికులతో  అర్జునుడికి ఘోర యుద్ధం జరుగుతుంది. ఎటువైపు అర్జునుడు ఒక్కడే పోరాడుతూ ఉంటాడు. రుగ్ముడు కొన్ని వేలమంది సైనికులను అర్జునుడి మీదకు పంపుతాడు.  ఒక్కసారిగా ఆ సైనికులంతా అర్జునుడి మీదకు రావడంతో అర్జునుడు తన వద్దనున్న అస్త్రాలు అన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని వద్ద అంతా సమయం లేదు.

సరిగ్గా అప్పుడే ఒక నాగలి వచ్చి, ఆ విదర్భ సైనికులందరిని ఒక్కసారిగా తుడిచిపెట్టేస్తుంది.
" అది సంధించింది ఎవరా ?" అని అర్జునుడి అతని వైపు చూడగా...
మిగిలిన విదర్భ సైనికులతో యుద్ధం చేస్తూ వాళ్లందరినీ మట్టుబెడుతూ అర్జునుడికి సాయం చేస్తాడు.

ఆ వీరుడు ఎవరో కాదు బలరాముడు
శ్రీ మహావిష్ణువు ఆ ఆదిశేషుని అవతారం.
త్రేతా యుగపు లక్ష్మణుని అంశ.
ద్వాపరయుగంలో ఈ శ్రీ కృష్ణ పరమాత్ముడి అన్నగా జన్మించాడు.

అలా యుద్ధంలో శైనికులందరిని మట్టుపెడతారు.

అప్పుడే అటువైపుగా అశ్వరధం పై శ్రీ కృష్ణుడు రుక్మిణీ నీ తీసుకుని వెళ్తూ రుగ్ముడు కంట పడతాడు.
అసలే రుక్మిణీ కృష్ణుడి తో వెళ్ళిపోతుంది అన్న కోపంలో ఉన్న రుగ్ముడు మరింత కోపంతో వాళ్ళని వెనుకనుండి తరుముకుంటూ వెళ్తుంటాడు.

రుగ్ముడి వల్ల కృష్ణుడికి రుక్మిణికి ఆపద పొంచి...