...

3 views

ప్రకృతి ఒడిలో ప్రేమ ప్రళయం 💔
మేఘం కరిగి చల్లని చిరు గాలితో చినుకు చినుకు చిటపటమంటూ,
నేలను తడిపింది...

ఆ తొలకరి జల్లుకి, భూమి మనసు పులకరించి పెదవి పలకరించెను...

వర్ణ, వర్ణ వచ్చావా నీ రాక కోసం వేయి కనులతో ఎదురు చూస్తూ ఉన్నాను.
నేను అంతే భూమి, నిన్ను చేరుకోవడం కోసం కోటి ఆశలతో దేవుణ్ణి కోరుకుంటూనే ఉన్నాను...

ఎంతకాలం మనకి ఈ శిక్ష వర్ణ?
ఇదంతా మన చేతులారా మనమే చేసుకున్నాము కదా భూమి.
ఓపికతో ఎదురు చూడడం తప్ప మనము ఏమి చేయలేము...

అయినా, ఆకాశం లో ఉండి నిరంతరం నిన్ను వీక్షిస్తూనే ఉన్నాను.
నీ మనసు నాకై పరితపించినప్పుడల్లా మేఘం వడిలో కరిగి తొలకరి చినుకునై నిన్ను ఇలా పలకరిస్తూ ఉన్నాను...

నేను కూడా నీలాగే వర్ణ,
భూమాతలో అంతర్భాగమై ఆకాశం నుండి చినుకై కురిసే నీ ప్రేమ వర్షంతో
అప్పుడప్పుడైనా నన్ను పలకరిస్తూ ఉంటావని నమ్మకంతో నిశ్చంతగా భూమాత గుడిలో ఊపిరి పీల్చుకుంటూ బ్రతుకుతున్నాను...
ఆకాశాన్ని భూమిని వాన చినుకు ఒకటిగా కలుపుతుంది భూమి.
అలాగే నేను వర్ణుడిలో అంతర్భాగమై ప్రేమ వర్షంతో నీకు నాకు మధ్య ఏ పరిణ ఏ అంతులేని దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను...

సరే వర్ణ ఇక వెళ్ళు మనం శిక్షని అనుభవించడంతోపాటు, ప్రకృతిని కాపాడవలసిన బాధ్యతని కూడా తీసుకున్నాము...
నువ్వు ఇలాగే కుంభకోత గా కురుస్తూ ఉంటే ప్రకృతికి ప్రమాదం వాటిల్లుతుంది...

సరే భూమి వెళ్ళొస్తాను తొలకరి చినుకై మరలా నీ మోమిని ముద్దాడే క్షణం కోసం ఎన్ని వేల క్షణాలైనా ఓపికతో ఎదురు చూస్తాను.
ఎడారిగా మారిన ఈ మనసు నీ తొలకరి జల్లు కోసం ప్రతి క్షణం ఎదురుచూస్తూనే ఉంటుంది వర్ణ...

ప్రచండమైన గాలులతో వర్ణుడు విరుచుకుపడుతున్నాడు.
తెరుపు లేకుండా కురుస్తున్న వాన దారకు ప్రకృతి అతలాకుతలం అవుతుంది.
ఆవేశంతో వాన చినుకులు అగ్ని కణాలుగా మారి నేలని తడుతూ భూమి భూమి అంటూ ఆవేశంగా పిలుస్తున్నాయి...

వర్ణ వర్ణ ఏంటి ఈ ఆవేశం
కొంచెం శాంతించు...
తొలకరి జల్లుకే పులకరించి ,
నన్ను పలకరించే నా భూమి, వారం రోజుల నుండి తెరుపు లేకుండా కురుస్తూనే ఉన్నాను అయినా తన స్వరం నాకు
తారస పడలేదు తను ఎంత మౌనంగా ఎప్పుడూ ఉండదు తనకి ఏమైనా ప్రమాదం జరిగిందా ప్రకృతి మాత.
నేను పెట్టిన గడువు పూర్తవ్వనంతవరకూ మీ ఇద్దరికీ ఏ ప్రమాదం లేదు కానీ నువ్వు కొంచెం ఓపికతో ఉండాలి,
నీ ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఇలా విరుచుకు పడి నీ ఆయుష్షుని తగ్గించుకోవద్దు ఇలా చేస్తే నేను ఏ విధంగా మీకు సహాయం చేయలేను...

పంచ భూతాలే సహాయం చేసి మీ ప్రేమని గెలిపించే ప్రయత్నం చేశాయి,
అప్పుడు మీ అర్థంలేని పంతాలు పట్టింపులతో మీ ప్రేమని మీరే దూరం చేసుకున్నారు ప్రకృతి ఒడిలో సమాధి అయినా మీ ప్రేమ మరలా తిరిగి ప్రకృతి ఒడిలోనే పుట్టాలి అని భగవంతుడు దీవించడంతో
అలా మీ మొదటి జన్మ ముగియగానే రెండో జన్మలో ఇలా ప్రకృతిలో భూమాతలో అంతర్భాగంగా భూమి వర్ణుడిలో అంతర్భాగంగా నువ్వు ప్రాణం పోసుకున్నారు...

ప్రకృతి మీ ప్రేమకు సహాయం కావాలి అని ఆ భగవంతుడు ఎప్పుడూ దీవించాడు అందుకే ఆ బాధ్యత ప్రకృతి మాత అయిన నాపై ఉంది.
అలాగే మొదటి జన్మలో మీరు చేసిన తప్పుకి శిక్షను విధించే బాధ్యత కూడా నా పైనే ఉంది. అందుకే ఎదురెదురుగా ఉన్న మీరు కలుసుకోలేకపోతున్నారు తాత్కాలికంగా కలిసిన మీ కలయిక శాశ్వతంగా నిలవలేక పోతుంది...

ఇవన్నీ ముందే మీకు వివరించి చెప్పాను అయినా కానీ ఓపిక పట్టకుండా ఇలా ఆవేశపడుతున్నావు...
మీ శిక్షకాలం ముగిసే సమయం, మరియు మీ ఇద్దరూ శాశ్వతంగా దగ్గరయ్యే సమయం దగ్గరలోనే ఉంది. అనవసరంగా అర్థం లేని నీ ఆవేశంతో దానిని దూరం చేసుకోవద్దు
వర్ణ ఒక విషయం గుర్తుపెట్టుకో మీరు మీ ప్రేమని కాపాడుకునే ప్రయత్నంలో శిక్షని అనుభవించడంతోపాటు,
ప్రకృతిలో అంతర్భాగమైన మీరు ప్రకృతిని కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది ఇలాగే నువ్వు ఆవేశంగా తెరుపులేని వానతో విరుచుకు పడితే నీ భూమి స్వరం శాశ్వతంగా మూగబోతుంది ఈ విషయం గుర్తుంచుకో...

ప్రకృతి మాత మాటలను పెడచెవిన పెట్టి వర్ణుడు ప్రకృతిపై తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నాడు. వర్ణ, వర్ణ ఏం చేస్తున్నావు ఇలా చేస్తే మన ప్రేమని మనం పొందలేము.
భూమి వచ్చావా ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు ఒక్క రోజు దూరంగా ఉన్నా నేను బ్రతకలేక పోతున్నాను దయచేసి నాకు దూరంగా వెళ్ళకు భూమి...
వర్ణ ఓపికతో ఉండు ఇలా ఆవేశపడే మొదటి జన్మలో మన ప్రేమని దూరం చేసుకున్నాము అయినా నీతో ఇంతసేపు మాట్లాడే సమయం కూడా నాకు లేదు నేను చెప్పేది జాగ్రత్తగా విను.

మనం మన ప్రేమని పొందడం కోసం మరో జన్మ ఎత్తినట్టు పర్వత్ కూడా నన్ను పొందడం కోసం ఈ జన్మలో పుట్టాడు...
కటోరమైన తపస్సు చేసి అగ్ని దేవుని ప్రసన్నం చేసుకుని అనేక శక్తులను పొంది విశాలమైన అగ్ని పర్వతంగా రూపు దాల్చాడు.
నేను నీతో మాట్లాడిన, నువ్వు నన్ను కలుసుకున్న అతను అగ్ని లావా లాగా పొంగి ప్రకృతిని భస్మం చేస్తాడు.
అతడు నా అంగీకారం లేకుండా నన్ను పొందలేడు కాబట్టి నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు నువ్వు ఆవేశపడి ఇలా చేస్తే ప్రకృతి మాత ఆగ్రహానికి లోనవ్వాల్సి ఉంటుంది
అప్పుడు మనకి ప్రకృతి మాత ఏ విధంగా సహాయ పడదు...

మనం ఈ లోపు కలుసుకున్న ఆ పర్వత్ అగ్ని లావా లా పొంగి ప్రకృతిని నష్టం చేస్తాడు ఈ జన్మలో కూడా మనం ప్రకృతిలో సమాధి అవుతాము మన ప్రేమని పొందలేము కాబట్టి అర్థం చేసుకో...

చెప్పాల్సిందంతా చెప్పి భూమి స్వరం మళ్లీ మూగబోతోంది...
భూమి, భూమి నాకు దూరంగా వెళ్లొద్దు నన్ను మళ్లీ ఒంటరి వాడిని చెయ్యొద్దు
అంటూ వర్ష దారతో పాటు కన్నీటి దారణ కురిపిస్తూ వినిపిస్తాడు వర్ణ...

ఒక భయంకరమైన గంభీరమైన వికృతమైన నవ్వు ఒకటి వినిపిస్తుంది వర్ణాకి, ఏంటి వర్ణ నువ్వు ఎంతగా చినుకుల్ని రాల్చిన మూగబోయిన భూమి మనసుని కరిగించలేవు...

అలాగే అగ్ని జ్వాలతో రగిలే నా పగని చల్లార్చలేవు...
ఇలా కురిసి కురిసి నీ ఆయుష్షు వాయువులో కలిసిపోతుంది.
భూమిని పొందలేక నీ ప్రేమ ఈ జన్మలో కూడా విఫలం అవుతుంది.
భూమిని దక్కించుకోవాలని నా కోరిక ఫలిస్తుంది అంటూ వికృతమైన నవ్వుతో మాయమవుతాడు...

వర్ణ ,ఆవేశాన్ని తగ్గించుకో ఆలోచనకు పదును పెట్టు మార్గం దొరుకుతుంది ఇదే నేను చెప్పే చివరి మాట అంటూ భూమి అదృశ్యం అవుతుంది.
అప్పటివరకు ఎడతెరపు లేకుండా కురిసిన వాన ఒక్కసారిగా ఆగిపోతుంది...వర్ణ ఆరు నెలల నుండి చేస్తున్న నీ సుదీర్ఘమైన
కటోర తపస్సుకు కారణం ఏమి...
మీకు అంతా విదితమేగా అగ్ని దేవా...
నాకు విధితమే కానీ నీ నోటితో వినాలని అడుగుతున్నాను.
నీ తపస్సుకి మెచ్చాను,
నీ భూమికి ఇచ్చిన మాటకు కట్టుబడి తనని కలవకుండా చూడకుండా ఉంటున్నా నీ నిశ్చలమైన మనసుని మెచ్చాను, నీకు విధించిన శిక్షని అనుభవిస్తూ ప్రకృతిని కాపాడడం కోసం బాధ్యత పూరితమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నీ వ్యక్తిత్వంతో నన్ను మెప్పించావు...

నీకు ఏ వరం కావాలో అడుగు ఏ వరమైన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను...
ధన్యవాదాలు అగ్ని దేవా వరం అడిగే ముందు నాకు ఒక సందేహం,
సందేహమా ఏమిటో అడుగు వర్ణ...
మీ దేవతలని ఎవరు తపస్సు చేసి వరాలు కోరిన మీరు వారు చేసేది సత్కార్యమా లేదా చెడు పనులు చేయడానికి వరాలు అడుగుతున్నారా అని ఆలోచించకుండా వాళ్లకి వరాలు ఇచ్చేస్తారు ఎందుకు అగ్ని దేవా.

ఓహో పర్వత్ విశాలమైన అగ్ని లావా పర్వతంలా రూపాంతరం చెందేలా నేను వరం ఇచ్చానని ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నావా వర్ణ. అవును అగ్ని దేవా...

ఓరి పిచ్చివాడా వరాలు కోరేదెవరు వరాలు ఇచ్చేది ఎవరు,
వరాలు అడిగించేది భగవంతుడే వరాలు ఇప్పించేది భగవంతుడే... నీకు ఒక విషయం చెప్పనా వర్ణ, అసలు ఈ తపస్సులు వరాలు లేకపోతే మన పురాణాలు కథలు ఎలా ఉండేవి...
మీ మానవులు దేవుడి దగ్గర మీ కోరికలను విన్నవించుకుంటారు,
దేవుడికి మీ కోరికలకి మధ్య మా పంచభూతాలతో ఉన్న ప్రకృతి వారధిలా పనిచేస్తుంది...
మీ కోరికలను తీర్చుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని విజయం వైపుగా పంచభూతాలు సహకరించి తీసుకొని వెళ్తాయి
కానీ, మీరు ఆ విషయం విస్మరించి పంచభూతాల సహాయాన్ని సరిగ్గా అందుకోరు మూర్ఖత్వంతో ముందుకి మీకు తెలిసిందే నిజమో అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు...
ఒక్కోసారి మీరు చేసే పని సరైంది కాదు అని పరోక్షంగా చెప్పడానికి ప్రకృతి అనేక సూచనలను ఇస్తూ ఉంటుంది మీరు వాటిని కూడా పట్టించుకోకుండా మీరు చేసేదే అనుకొని ముందుకి సాగిపోతూ ఉంటారు సమస్యల్ని ఎదుర్కొంటారు... అందుకే మీరు మీ ప్రేమని పొందడానికి రెండు జన్మల సమయం వేచి ఉండవలసి వచ్చింది.
నన్ను క్షమించండి అగ్ని దేవా...
నిన్ను ఆ భగవంతుడే క్షమించాడు అందుకే వరంతో నన్ను నీ దగ్గరకు పంపించాడు అయినా నువ్వు ఇప్పుడు సరైన మార్గంలోనే ఉన్నావు...

చూడు వర్ణ ఆ పర్వత్ నా నుండి వరం పొంది తన శక్తులను మరింత పెంచుకొని అత్యంత శక్తివంతుడిగా మారాడు...

అతన్ని ఎదుర్కోవడానికి నీకున్న శక్తి సరిపోదు అతని,
అగ్ని లావాన్ని బద్దలు కొడితే తప్ప అతని శక్తి విచ్చిన్నం కాదు అప్పుడు నువ్వు సులువుగా అతనిని ఢీకొనవచ్చు.
అయితే ఆ పని అంతా సులభం కాదు అగ్నిని అగ్నితోనే ఢీ కొనాలి నాలో ఉన్న అగ్ని కణాలను వరం రూపంలో నీ లోనికి పంపిస్తాను,
అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది నువ్వు వర్ణుని లో అంతర్భాగానివి ,అగ్ని కణాలు నీ లోపల
ఈమడ లేవు...
అవి వెంటనే నీటి చినుకులుగా మారిపోతాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి అగ్నిదేవా... దీనికి ఒకటే పరిష్కారం నువ్వు ఆ పర్వత్ ని ఎదుర్కొనే అంత సేపు అగ్ని తత్వాన్ని పొందాల్సి ఉంటుంది దీని వలన నీ ఆయుష్షు తగ్గిపోయి నీ ప్రాణం వాయువులో కలిసిపోతుంది అయితే అది ఎంత సమయం వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావో అన్న విషయం మాత్రం నేను చెప్పలేను పర్వత్ ని అంతం చేసిన తర్వాత నీ ప్రాణం వాయువులో కలిసిపోవచ్చు లేదా కొంతకాలం తర్వాత అయినా అది జరగవచ్చు లేదా అగ్నితత్వాన్ని తట్టుకోలేక ఇప్పుడే నీ ప్రాణం వాయువులో కలిసిపోవచ్చు...
నాకు నమ్మకం ఉంది అగ్ని దేవా నేను ఆ పర్వత్ ని అంతం చేసి నా భూమిని చేరుకుంటాను...
మీరు నాకు వరం ఇచ్చి దీవించండి నేను విజయంతో తిరిగి వస్తాను.
అలాగే వర్ణ నేను నీకు వరం ఇస్తాను అయితే నీ శరీరం ఎంతో బాధని ఓర్చుకోవాల్సి ఉంటుంది. అగ్నితత్వాన్ని శరీరంలో నింపుకోవడం అంటే మంటల మధ్యలో నిలబడడమే ఇది నీ సహజత్వానికి వ్యతిరేకం అందుకే నీకు ఎంతో కష్టంగా బాధగా ఉంటుంది...
నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను అగ్నిదేవా...
తధాస్తు విజయ ప్రాప్తిరస్తు అంటూ అగ్నిదేవుడు వరంతో వర్ణాన్ని దీవిస్తాడు...


అప్పటివరకు సన్నని చిరుగాలితో ప్రకృతిని ఆహ్లాదాన్ని అందిస్తూ చిరు జల్లుతో ప్రకృతిని ప్రేమిస్తున్న వర్ణుడు,
ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రచండమైన గాలులతో ప్రళయం లాంటి వానతో విరుచుకుపడుతున్నాడు...
చూడు భూమి మీరు దగ్గరయ్యే సమయం వచ్చింది కానీ నేను ఎన్నిసార్లు చెప్పినా వర్ణుడు నా మాట వినక, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఇక నేను ఏమి చేయలేను. వర్ణ ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంకా కొన్ని రోజులు ఓపికతో ఉండొచ్చు కదాl నీ ఆవేశంతో నన్ను ఈ జన్మలో కూడా దూరం చేసుకుంటున్నావు...
తన వికృతమైన నవ్వుతో నేను అనుకున్నదే జరుగుతుంది ఈ వర్ణ ఆవేశంతో తన ఆయుష్షుని తగ్గించుకొని ప్రాణం వాయువులో కలిసిపోతుంది అప్పుడు ఈ భూమిని నేను పొందుతాను నాకు విజయం తథ్యం అంటూ గట్టిగా నవ్వుతూ ప్రకృతి తల్లడిల్లేలా అరుస్తున్నాడు...

పర్వత్ నువ్వు అంతమయ్యే రోజు వచ్చింది అంటూ వర్ణ అగ్ని కణాలను పర్వత్ పై కురిపిస్తున్నాడు పర్వత్ అగ్ని లావా బద్దలైంది...
ఇక వర్ణ పర్వత్ ని లొంగ తీసుకొని తన శక్తులన్నింటినీ ఉపయోగించి పర్వత్ ని శక్తిహీనుణ్ణి చేస్తాడు...

భూమి ఇక మనల్ని ఎవరు వేరు చేయలేరు నిన్ను పొందడం కోసమే నేను పుట్టాను నా ప్రేమ కోసమే నువ్వు పుట్టావు అంటూ భూమిపై చిరు జల్లుని కురిపించే ప్రయత్నం చేస్తుంటే,


తన సహజత్వాన్ని కోల్పోయిన విషయం వర్ణాకి అర్థమవుతుంది అగ్ని దేవుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి... ఏంటి వర్ణ ఎందుకు ఆలోచిస్తున్నావు అలసిపోయిన నా హృదయానికి నీ చిరుజల్లుతో సేద తీర్చు అంటూ అడుగుతున్న భూమితో
భూమి నన్ను క్షమించు ఆ పర్వత్ ని అంతం చేసే ప్రయత్నంలో నా సహజత్వాన్ని నేను కోల్పోయాను అంటే నా ఆయుష్షు తగ్గిపోయింది నా ప్రాణం వాయువులో కలిసిపోయే సమయం వచ్చింది నాకు నమ్మకం ఉంది మరో జన్మలో కచ్చితంగా నిన్ను కలుసుకుంటాను మనం మన ప్రేమతో జీవితాంతం కలిసి ఉంటాము...
వాయువులో కలిసిపోయిన నా ఆయువుతో భూమిపై పుట్టే నీ ప్రాణానికి ఆయుష్షుని అందిస్తాను మరో జన్మలో కలుస్తాను ఇక సెలవు...

వర్ణ, వర్ణ నన్ను ఒంటరిదాన్ని చేయవద్దు ఈ జన్మలోనైనా నిన్ను కలుస్తాను అనే నమ్మకంతో ఉన్న నా ఆశలని అడియాస చేయవద్దు దయచేసి నాకోసం తిరిగి రా అంటూ బిగ్గరగా అరుస్తూ ఏడుస్తున్న భూమిని చూసి ప్రకృతి మాత ఈ విధంగా చెబుతుంది... చూడు భూమి ఇది ఆ దైవ నిర్ణయం దీనిని ఎవ్వరం మార్చలేము.
మరో జన్మలో పుట్టబోయే మీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు ఎదురు రావు ప్రేమతో జీవితాంతం సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు ఇది ఆ దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం...

అయితే నేను ఈ భూమాత ఒడిలోనే ప్రాణత్యాగం చేస్తాను...

మరో జన్మలో కొత్తగా పుట్టే మా ప్రేమకు ప్రాణం పోస్తాను...
వర్ణ ప్రేమతో మరో జన్మలో కలుస్తాను ఇక సెలవు....✍️
© Dinesh muddada