"శ్రీ కృష్ణ మహా భారతం - 54
"శ్రీ కృష్ణ మహా భారతం - 53" కి
కొనసాగింపు...
"శ్రీ కృష్ణ మహా భారతం - 54"
శకుని తన కుటిల బుద్ధితో పురోచననుడిని కుంతీ వద్దకు పంపిస్తాడు. పాండవులతో సహా కుంతీని కూడా వారణావర్తానికి ఆహ్వానించడానికి.
పురోచనడు గృహాలను నిర్మించేవాడు. అంతేకాదు దుర్యోధనుడికి నమ్మిన బంటు. అందుకే శకుని అతని ద్వారా తన పథకం అమలు చెయ్యాలి అనుకుంటాడు.
ఇక పురోచనుడు సతీ సమేతంగా కుంతీ వద్దకు వెళ్ళి,
"కుంతీ మాతా..!
మిమ్మల్ని, మీ కుమారులను మేము వారణా వర్తం ఆహ్వానించదలచి ఇక్కడికి వచ్చాము. అక్కడ ఏనుగులు చిన్న చిన్న పర్వతాలుగా కదులుతూ చూడడానికి బహు సుందరంగా ఉంటాయి." అంటూ అక్కడి విశిష్టతలను వివరించి కుంతీను మభ్య పెట్టాలని చూస్తాడు.
దానికి కుంతీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. పురోచనుడికి కుంతీ మౌనంలో తను అతడి ఆహ్వానానికి విముఖంగా ఉన్నట్టు అర్ధమయ్యి...
"మాతా ఎందుకు మీరు అంతా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.
పాండురాజు వారు మీ వివాహం కాక మునుపు అక్కడికి ప్రతి సంవత్సరం వచ్చేవారు. ఆయనే ఉంటే మేము ఇలా ఆహ్వానించవలసిన అవసరం కూడా వచ్చి ఉండేది కాదు.
మీరు మీ కుమారులతో సహా అక్కడికి విచ్చేసి మీ జ్యేష్ట పుత్రుడు యుధిష్ఠిరునితో ఆ పరమేశ్వరునికి పూజ చేస్తే స్వర్గంలో ఉన్న పాండు రాజు వారి ఆత్మ కూడా శాంతిస్తుంది. అంతేకాదు, మేము మీకు అక్కడ ఒక ప్రత్యేక గృహాన్ని నిర్మించాము. మీ కుమారులతో పాటు అక్కడే మీరు కొద్ది కాలం పాటు నివసించి, అక్కడ పరిసరాలను గమనించడం వలన అక్కడి ప్రజలకు కూడా సంతోషం కలుగుతుంది" అంటూ పురోచనుడు ఒక సెంటిమెంటు అస్త్రాన్ని ఉపయోగిస్తాడు.
తన భార్య కూడా కుంతిని బ్రతిమాలాడంతో...
వీరి కుయుక్తులు అర్థం కానీ కుంతీ అందుకు ఒప్పుకుంటుంది.
కానీ, వచ్చి అక్కడ కొద్ది రోజులు నివసించడం అనేది జరగని పని అని, దానికి కారణం యుధిష్ఠిరుడు ఇప్పుడే యువరాజుగా పట్టాభిషేకం జరగడం వలన హస్తినపుర రాజ్యభారం తన పై ఉంటుందని, యాగం ముగించుకుని తాము తిరుగు ప్రయాణం అవుతామని కుంతీ పురోచనుడితో అంటుంది.
పురోచనుడికి తన పథకం ఎక్కడ విఫలం అవుతుందోనని,
ఆమెను మరింత బ్రతిమాలుతూ అక్కడ కొద్ది రోజులు ఉండడానికి ఒప్పిస్తాడు.
దానికి ఏం బదులు చెప్పాలో తెలియని కుంతీ
"సరే, నేను ఒకసారి యుధిష్ఠిరునితో కూడా సంప్రదింపులు జరిపి, అతని నిర్ణయాన్ని...