...

9 views

ఒక వ్యభిచారి కధ
ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుల నుండి అత్యంత దరిద్రులు సైతం అసహ్యించుకునే వృత్తి "వ్యభిచారం".
కానీ ఒక మహిళ ఆ వృత్తి చేయడానికి ఎన్నో కష్టాలు.... ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి...
ఆ కన్నీటి వెనుక ఉన్న కధ ఇది....
ఒక అర్దరాత్రి తన ఒంటి పై సర్వ హక్కులు ఆ రాత్రి కి కొనుక్కున్న వాడు తన పై ఒక మృగం తనపై విజృభిస్తుంటే....
ఆ నొప్పి ని తన కళ్లలో దాస్తూ....
గతం చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటుంది...

ఒక పదహారణాల పడుచు పిల్ల, అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ..
తల్లి తండ్రుల ప్రేమ ని ఆస్వాదిస్తూ, తన స్నేహితులతో ఎల్లప్పుడూ సరదా గా
ఉంటూ అందరిలోనూ మంచితనం పెంచుకుంది.
తన కూతురు కలెక్టర్ అయ్యి తన కష్టాలు తీరుస్తుంది అని నమ్మే తన తండ్రి నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని, తన తండ్రి ఆశ ని తన ఆశయంగా మలుచుకుంది..
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో రాగానే కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి.
తరగతి గదిలో తన కంటే బాగా చదివే సూర్య అనే అబ్బాయి కి తనకు ఎప్పుడూ చదువులో పోటీ ఉండేది.
ఆ పోటీ కాస్త పరిచయం గా మారి, ఆ పరిచయం స్నేహంగా మారింది..
ఇద్దరి మధ్య ఆ స్నేహం ప్రేమ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.
కానీ ఆ అబ్బాయి తనని ఒక అవకాశం గా మాత్రమే భావించేవాడు..
అయితే అలాంటి రోజు రానే వచ్చింది..
నాలుగు గోడల మధ్య సర్వం తన హక్కు అనుకున్నాడు అతను...
నలుగుతున్న శరీరం నాలుగు నిమిషాలు తనది కాదనుకుంది తను...
అవకాశం వచ్చినప్పుడల్లా వాడుకొనే వాడు..
అయితే ఒక రోజు ఆ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ వ్యవహారం తెలిసింది..
ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి కి వెళ్తే అతను తను ఎవరో కూడా తెలియదని ....
అసలు ఆమె కి తనకి ఏమాత్రం సంబంధం లేదని చెప్పాడు..
దీంతో తను మోసపోయిందని ఎంతో ఆలస్యంగా తనకి అర్ధం అయ్యింది...
తన తల్లి తండ్రులు ఆమె మీద అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది..
తనకి జరిగిన అన్యాయం తెలియజేయాలని ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ ఉన్న S.I కూడా "ఎలాగో ఒకడి దగ్గర పడుకున్నావు కదా...
ఇప్పుడు నా దగ్గర పడుకో నీకు న్యాయం చేస్తా"
అని నీచం గా మాట్లాడాడు..
ఒక బాధ్యత కలిగిన పదవి లో ఉన్న వ్యక్తే ఇలా మాట్లాడితే ఇంక నాకు ఎక్కడా న్యాయం దొరకదు. అని కన్నీరు కారుస్తూ బయటికి వచ్చింది...
తనకి ఇంట్లో ప్రేమ, ఓదార్పు దొరకడం కనుమరుగు అవుతున్నాయి...
కాలేజీ లో తనకి ధైర్యం ఇవ్వవలసిన స్నేహితులు కూడా "ఒక గంట కి వస్తావా...ఒక రాత్రి కి ఎంత"?? అని సూటిపోటి మాటలతో హేళన చేసేవారు..
తన స్నేహితురాళ్ళు కూడా తనని ఒక అంటువ్యాధి గ్రస్తురాలిగా చూసేవారు...
ఇంక ఈ అవమానాలు భరించలేక ఆమె ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలి అని నిర్ణయించుకుంది..
అనుకున్నదే తడవుగా ఆమె ఇంట్లో వాళ్లకి తెలియకుండా పట్నం వెళ్లిపోయింది..
ఆమె తల్లిదండ్రులు కూడా అసలు మాకు కూతురే పుట్టలేదు అని చెప్పుకుని తిరిగారు...
ఆమె పట్నం వచ్చింది కానీ ఏం చెయ్యాలో అర్ధం కాలేదు..
పని కోసం ఎంత వెతికినా దొరకలేదు..
ఆకలితో మూడు రోజుల పాటు ఉంది..
అయితే ఒక రోజు ఒక పెద్దాయన వచ్చి ఆమె కు కొంత ఆహారం ఇప్పించారు..
ఆయన ఆమెను చూస్తూ"అమ్మా...నా దగ్గర పని ఉంది, చేస్తావా?? అని అడిగాడు..
ఆకలితో ఉన్న తనకి అతను అన్నం పెట్టాడు, అతనిని నమ్మి సరే అన్నాది..
అతను ఆమె ని తీసుకుని ఒక పెద్ద భవంతి కి తీసుకొని వెళ్లాడు..
రా ఇది నా ఇల్లు అని చెప్పి..
కొంచెం ఈ నీటిని తాగు అని ఇచ్చారు..
ఆమె దానిని తాగిన తర్వాత కొంచెం తల తిరుగుడు మొదలైంది...
అలా స్పృహ కోల్పోయింది...
కొంత సేపటికి కళ్లు తెరిచి చూస్తే తన ఒంటి పై బట్టలు లేవు.. ఆ పెద్దాయన చొక్కా వేసుకుంటూ డబ్బు కట్ట విసిరాడు...
అప్పుడే ఆమె కు అర్ధమైంది,
ప్రతీ మగవాడి కి కావల్సింది ఆడదాని శరీరం మాత్రమే అని ....
తన కన్నీళ్ళకు ఈ ప్రపంచంలో విలువ లేదు అని....
తన ఆలోచనలు అలా రగులుతున్న సమయం లో తనని ఒక రాత్రి కి కొనుక్కున్న వాడు అలసిపోయి 2000 రుపాయిలు తన చేతి కి ఇచ్చాడు...
ఏ ఒక్కరూ గౌరవం లేకుండా ఈ సమాజంలో బ్రతకాలి అనుకోరు....
ఇంత నీచమైన వృత్తి చేయడానికి ఆమె మానసికంగా శారీరకంగా ఎంతో నొప్పి ని భరిస్తుంది...
అందమైన కలలు కనే ఒక అమ్మాయి ఇలా పీడకలలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది..
దయ చేసి ఎవరిని చులకన భావంతో చూడవద్దు....
కొన్ని సార్లు పరిస్థితుల వలన మనం ఎంత పెద్ద తప్పు అయినా చెయ్యవలసి వస్తుంది...
మీ.....
© Dinesh muddada