...

7 views

IAM YOU💝



"ఐ లవ్ యూ"


"Sorry నాకు టైం లేదు"

"ప్రేమ లేకపోతే బాధపడాలి కానీ టైం ఎం ఉందిలే,ప్రేమిస్తే అదే వస్తుంది"


"Excuse me!! మీరెవరో కూడా నాకు తెలీదు" అంటూ కాఫీ కప్ కింద పెడుతూ అన్నాడు విహారి.


"కానీ మీరు నాకు తెలుసు, actually నేను మీరు ఒకే కాలనీ లో ఉంటాం. మిమ్మల్ని ఫోర్ ఇయర్స్ గా చూస్తున్నా, మీరు ఎం చదివారు, ఎం చేస్తారు, ఎం తింటారు, మీకు ఏమేం ఇష్టం , నచ్చనివి ఏవి అన్ని నాకు తెలుసు మీ గురించి మూడు పెళ్లి సంబందాలు రిజెక్ట్ చేసాను...." తను చెప్తూనే ఉంది.


"చూడు అమ్మాయి...."


"ఇందు.." చిన్న నవ్వు అల్లుకున్న పెదాలతో అంది.


"అదే.. చూడు ఇందునో ఇంకోటో ఇలా నాలుగు ఏళ్ళు టైం వేస్ట్ చేసుకునే బదులు నీకు ఈ ఆలోచన వచ్చిన రోజే నాకు చెప్పి ఉండాల్సింది.ఈ ప్రేమ , పెళ్లి ఇలాంటివాటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు,...