...

1 views

"ది ఎఫైర్ - 3"
"ది ఎఫైర్ (ruins a human life) - 2" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 3"

అలా వారి ముగ్గురిని విచారించిన పోలీసులు, మరిన్ని అనుమానాలను ఏర్పరుచుకున్నారు తప్ప, కేసులో ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు.

శివరాం ఉండే ఇంట్లో సోదాలు నిర్వహించడం వలన కానీ,
వాళ్ల ఇంటి చుట్టూ పక్కల వాళ్ళని విచారించడం వలన కానీ ఇంకా ఏమైనా ఆధారాలు లభించ వచ్చునేమొనన్న
పై అధికారుల ఆదేశాలతో...
టౌన్ పరిధిలోని పోలీసులు ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

దానికి కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మరియు రాంబాబు లను ఎంపిక చేశారు.

ముందుగా శివరాం ఇంట్లో తనికీలు నిర్వహించారు అక్కడికి వెళ్ళిన కానిస్టేబుల్స్...
రోజంతా కష్టపడి, ప్రతి చోటా అణువణువునా గాలించినా చిన్న క్లూ కూడా లభించలేదు వాళ్ళకి.
కానీ, చివరకు వాళ్ళు అక్కడనుండి వెళ్లిపోయే ముందు మూలాన ఉన్న ఒక బీరువా పక్కన కొన్ని పేపర్స్ దొరికాయి. అవి శివరాం స్వతహాగా రాసుకున్న కవితలు, కథలు.

ఉదాహరణకి కొన్ని రచనలు చదివిన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే...
శివరాం భార్య చెప్పినట్టు అతనేదో కాలక్షేపానికి రాసెట్టు కనిపించడం లేదు ఆ రచనలు.
ఎప్పటికైనా తనొక గొప్ప రచయిత కావాలనే దృఢ సంకల్పంతో రాసినట్టుగా ఉన్నాయి.
అందులో వాటి అర్థాలు అంత లోతుగా ఉన్నాయి మరి!

పోలీసులు అతని రచనల్లో గమనించిన మరొక విషయం ...
తను రచనలు రాయడానికి అతను ఎంచుకున్న పేపర్స్ ...
స్కూల్ పిల్లల పుస్తకాలలోనివని.

బహుశా అతని పాప స్కూల్ బుక్స్ లోనివి అయ్యిండొచ్చని ఆ కానిస్టేబుల్స్ అనుకున్నారు. నాగమణిని అడగ్గా ఆమె కూడా అదే విషయం వాళ్ళకి చెప్పింది.

ఇక తర్వాతి రోజు అదే కానిస్టేబుల్స్ చుట్టుపక్కల వారిని విచారించడానికి వెళ్ళారు.
ఆ కానిస్టేబుల్స్...
ఇంతకు ముందు నాగమణి, సత్యనారాయణ మరియు గంగాధర్ స్టేట్మెంట్స్ ను ఆధారంగా చేసుకొని అక్కడున్న వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగారు.

వాళ్ళు మాత్రం పోలీసులకి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
"శివరాం, నాగమణి తమకు పదేళ్లుగా తెలుసని, వాళ్లసలు చుట్టుపక్కల వాళ్ళతో పెద్దగా కలిసేవారు కాదని,
శివరాం అయితే పనికి వెళ్ళడం లేదంటే ఇంట్లో ఒంటరిగా కూర్చోడం అంతేనని,
ఎవరిని చిన్న మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటుండేవాడని

శివరాంకి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవని,
ఇక తాగుడు, తిరుగుడు విషయానికి వస్తే...
అసలు ఈ పదేళ్లలో అతడు అలాంటివాడిలా ఎప్పుడూ కనిపించలేదని,
నాగమణి మాత్రం ఎప్పుడూ డ్యూటీ అంటూ దగ్గర టౌన్లో ఉన్న హాస్పిటల్ కి వెళ్లేదని, ఆమెకు కూడా ఇరుగుపొరుగు వారితో ముచ్చట్లు చెప్పేంత తీరిక ఉండేది కాదని వాళ్ళు వివరించారు.

ఇక ఆ మూడో వ్యక్తి...