...

4 views

పొదుపు
అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు. ఇద్దరిని ఒక మంచి పాఠశాలలో చదివిస్తున్నాడు. ఒక రోజు ఆ రైతు వాళ్లు చదివే పాఠశాలకు వెళ్లాడు. అక్కడ పిల్లలు లేవో చిరుతిళ్ళు కొనుక్కుని తింటున్నారు. కానీ ఆ రైతు పిల్లల మాత్రం వాళ్ళ వైపు దీనంగా చూస్తున్నారు. ఇది చూసిన రైతుకి బాధగా అనిపించింది. వాళ్లకి కొంత డబ్బు ఇచ్చి ఏదైనా కొనుక్కో మన్నాడు. పిల్లవాడు రాము ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు. ఒక రోజు ఆ రైతు కూతురు కమల టీచర్ పొదుపు గురించి పాఠం చెప్పింది. అప్పటినుంచి కమల ఆ డబ్బుని ఖర్చు చేయకుండా దాచుకునేది. తన తమ్ముడికి కూడా పొదుపు గురించి చెప్పింది. నువ్ ఆ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు. నువ్ ఆ డబ్బు దాచుకుంటే మనకి ఏ కష్టం వచ్చినా ఆ కష్ట సమయాల్లో మనం దాచుకున్న డబ్బు ఉపయోగపడుతుంది. అక్క మాటలు విన్న రాము తను చేసిన తప్పును తెలుసుకుని నేను ఇప్పటి నుంచి డబ్బులు దాచుకుంటాను అన్నాడు. అప్పటినుంచి వాళ్ళిద్దరు డబ్బులు దాచి పెట్టడం మొదలుపెట్టారు.
ఒక రోజు ఆ రైతుకు తీవ్ర అనారోగ్యం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ఆపరేషన్ చేయాలి అన్నాడు. కానీ వాళ్ల దగ్గర అంత స్థోమత లేదు. కమల కి రాము కి ఒక ఉపాయం తట్టింది. వాళ్లు దాచుకున్న డబ్బులు లెక్క చూసారు. అవి ఆపరేషన్ కావాల్సిన డబ్బులు సరిపోయాయి. వెంటనే డబ్బులు డాక్టర్ కి ఇచ్చేశారు. ఆ రైతు కోలుకున్నాడు. తాను ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయకుండా దాచుకొని కష్ట సమయాల్లో ఆదుకున్న అందుకు ఆ రైతు పిల్లల్ని అభినందించాడు.
ఇట్లు మీ శ్యామ్ ప్రసాద్

© All Rights Reserved