...

4 views

Start Loving Yourself
నేను నా జీవితంలో నేర్చుకున్న విలువైన పాఠాలలో అత్యంత ముఖ్యమైనది మనల్ని మనం ప్రేమించుకోవటం,మనల్ని మనం నమ్మటం. ఇక్కడ అందరికీ తెలిసిన నిజం ఏంటీ అంటే మీతో మీరు వేసే అడుగే ఇతరులతో మీరు వేసే అడుగులను నిర్దేశిస్తాయి.

జీవితంలో వేరొక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమించటానికి మునుపు మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకొని క్షణాన ఇతరులు మనల్ని ఇష్టపడతారు అని అనుకోవటం మన మూర్ఖత్వం. ఇంకా గొప్ప విషయం ఏంటీ అంటే ఇతరులకు తమ ఆత్మగౌరవాన్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి చాలా గొప్పగా అద్భుతమైన సలహాలు ఇచ్చే మనం, మనల్ని మనం ప్రేమించుకోవటానికి మాత్రం అష్టకష్టాలు పడుతుంటాం.

మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత హుందాగా ఎంత గొప్పగా ఎంత తెలివిగా మాట్లాడతామో మనతో మనం మాట్లాడుకునే సమయంలో కూడా అలానే మాట్లాడుకోవాలి తప్ప, చేసిన తప్పులని గుర్తు చేసుకుని కించపరుచుకోవటామో, గతం గురించి నిందించుకుంటూనో ఉండకూడదు.

పడుకున్నాక ఇంకా నిద్రపట్టడానికి మధ్య సమయాన్ని చాలా మంది వాళ్ళని వాళ్ళు తమ గతాన్ని స్మరిస్తూ బాధ పెట్టుకుంటునో, ఏడుస్తూనో గడిపేస్తుంటారు. కాని వాళ్ళకి అర్థం కాని ఒక మంచి విషయం ఏంటీ అంటే ఆ సమయాన్ని మనతో మనం మాట్లాడుకునే ఒక మంచి సమయంగా లేదా మన గురించి మనం ఆలోచించే ఒక అద్భుత గడియలుగా మార్చుకోవచ్చు.

అసలు మనల్ని మనం మనస్పూర్తిగా ప్రేమించుకోకుండా ఇతరులని ఎలా మనస్పూర్తిగా ఎలా ప్రేమించగలం. నీ ప్రేమ తాలూకు మాధుర్యాన్ని నీవే రుచి చూడకపోతే ఇతరులు నీకు ప్రేమ ఇస్తారని ఎలా ఆశించగలవు, ఇచ్చిన ఎలా ఆస్వాదించగలవు.

మనలో ఉన్న తప్పులను క్షమించి ప్రేమను చూడగల సామర్థ్యం నుండి కరుణ, జాలి లాంటి గొప్ప లక్షణాలు మనలో అలవరతాయి.
మనల్ని మనం ప్రేమించుకోవటం స్వార్థం ఏమి కాదు మనం ఇతరులని ప్రేమించటానికి అవసరమైన ప్రేమను మనలో రప్పించే ఒక గొప్ప కార్యం.


#telugu #writings #inspiration #L❤️VE