"పట్టణంలో పెద్దాయన ! - 1"
ఆ రోజు మధ్యాహ్నం కావొస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్లిన నాకు బాగా ఆకలిగా అనిపించి, చుట్టూ ఏదైనా ఓ పెద్ద రెస్టారంట్ ఏమైనా ఉంటుందేమొనని చాలా సేపు వెతికాను.
అసలే బయట హోటల్స్ లలో చికెన్ బిర్యానీ తప్ప మామూలు భోజనం రుచించదు మనకి.
ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్టు మాట.
అలా ఎంతసేపు వెతికినా చిన్న చిన్న భోజన హోటల్స్ తప్ప, పెద్ద హోటల్స్ ఏం కనిపించడం లేదు నాకు. అందులో మామూలు భోజనం తప్ప, బిర్యానీ ఉండదేమోనన్న సందేహం !
అలా తిరిగి తిరిగి అలసిపోయి నేను, ఆకలికి తట్టుకోలేక చివరికి ఓ చిన్న భోజన హోటల్ కి తప్పక వెళ్ళాను.
వెళ్లాల్సి వచ్చింది !
ఇక ఆకలి పెట్టే టార్చర్ భరించలేక, అక్కడే ఒక టేబుల్ పై కూర్చుని వెయిటర్ ఇచ్చిన మెనూ చూస్తుంటే, అందులో నాకిష్టమైన చికెన్ బిర్యానీ ఐటెం కనిపించగానే ఇంకో ఐటెం వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెంటనే అది ఆర్డర్ ఇచ్చేశాను.
కొద్ది సేపటికి నా ఆర్డర్ రావడంతో ...
తీరిగ్గా దాన్ని ఆస్వాదిస్తూ తినడం మొదలు పెట్టాను.
అలా అది సగం పూర్తయ్యేసరికి,
నా పక్కనే మరో టేబుల్ లో
దాదాపు ఒక అరవై ఏళ్ళు పై బడిన ఒక పెద్దాయన వచ్చి కూర్చున్నాడు.
మాసిన గడ్డం, చెదిరిన జుట్టూ, చిరిగి, నలిగిన బట్టలు, బక్క పలచని శరీరంతో చాలా మురికిగా ఉన్న అతన్ని చూస్తుంటే బిక్షాటన చేసే వాడిలా ఉన్నాడు.
ఆ పెద్దాయన అలా వచ్చి కూర్చున్నాడో లేదో ....
వెయిటర్ చాలా వేగంగా వచ్చి,
" హేయ్ ..!
ఎవరు నువ్వు !!
ఇక్కడికొచ్చి కూర్చున్నావేంటి ?
పో..!
బయటకి పో ..!! " అంటూ తన చూపుడు వేలితో ఆ పెద్దాయనికి బయటకి దారి చూపుతూ
" ఈ అడుక్కునే వాళ్ళకి పనీ పాటా లేకుండా పోయింది
నేరుగా లోపలికి వచ్చేసి...