...

1 views

అనుకోని ఒక రోజు
ప్రతి మనిషి జీవితం ప్రేమకై, అనుకోని క్షణాలు ఎన్నో, ఊహించని రోజులు ఎన్నో కథా ప్రారంభమవుతుంది.
ఈ కథ ఒక రోజులో (ఆ ఒక్క రోజులో ఈ కథ తిరుగుతుంది) ఆ ఒక్క రోజు ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణం ఆరు సంవత్సరాల కలవని రోజులు ఎన్నో?
ఇది ఒక ప్రయాణం ప్రేమో, ఇష్టమో తెలియదు ఆ ఒక్క రోజు గురించి ఎన్నో రోజులు తపన ఆ రోజు గురించి దేవుని సైతం ప్రార్థించాడు. దేవుని కూడా ప్రార్థించిన చేతులు, ప్రేమకై ప్రార్ధించాడు ప్రేమ అ ఎంత గొప్పదో, ప్రపంచాన్ని జయించిన డానికి అల్జందర్ ఎన్ని యుద్ధాలు చేశాడో,తెలియదు.కానీ ఆ ఒక్క రోజు గురించి ఎన్ని రాత్రులతో యుద్ధం చేశాను నాకు కూడా తెలియదు.
తను గురించి చెప్పలేదు కదూ, అయితే వినండి. తను నా ప్రేమకై పుట్టిందని నాకనిపిస్తుంది. తను అందమం.తా చిరునవ్వుతో ,అలంకరించి నట్లుగా ఉంటుంది. తన మనస్సు వెన్నెల వలె ప్రశాంతంగా ఉంటుంది . తన ముఖం తన ముక్కు తను చూస్తున్నంత సేపు స్వర్గాన్ని జయించినట్లే అనిపించింది.
ఈ కథ 6 వ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు కోసం, కనురెప్పలు మూత పడకుండా ఎదురు చూశా, ఆరోజు రానే వచ్చింది. ఆరోజు ఊరంతా సందడిగా ఉంది. ఏదో తెలియని ఆనందం, వచ్చిందే అనిపించింది. ఆ రోజు కోసం నన్ను నేనే మరిచిపోయాను, ఈ లోకమే మరిచిపోయాను. తనకోసం ఊరి చివరలో ఎదురు చూశా అనుకోకుండా తన మాటలు మనసుకు వినిపించింది. అప్పుడే నాకు చీకటి నుండి వెన్నెల కాంతులు విచ్చుకొంటు వచ్చినట్లు నాలో ఏదో తెలియని భావన కలిగింది.
తను చూసేసరికి నేను కూడా తనవైపుకు చూసి అలా ఉండి పోయాను, అప్పుడే తన కనులు నాతో పలకరించింది. నాలో తెలియని బాధ ,వెలితి పోయినట్టు, అప్పుడే పుట్టిన పిల్లాడిలా నా మనసు  మారిపోయింది. తనతో ఏమి మాట్లాడాలో, నాలో నేను ఏమి తెలియని అజ్ఞాని లా ఉండిపోయా'
అప్పుడే ఈరోజు ఇంత వేగంగా గడిచిపోయిందా అనుకున్నా, అయినా తన దగ్గరికి వెళ్లి మాట్లాడాలని అనుకున్నాను, కానీ నాలో తెలియని భయం మొదలయ్యింది. ఆ సమయంలో నాలో ఇలా అనిపించింది, మనసుకు నచ్చే ఏ అమ్మాయి అయినా నా మనసులో మాట చెప్పాలని అనుకున్నాను కానీ తన దగ్గర వచ్చినప్పుడు చెప్పలేక పోయాను

,. ఆరోజు సమయం అయిపోయింది అప్పుడే పొద్దు పోయింది. మనసు కూడా కుదుటపడింది. "ఆరోజు ఊరంతా రంగురంగుల నక్షత్రాలు మిల మిల మెరిశాయి వెన్నెల చల్లదనం ఊరంతా, ఆకాశ చుక్కలు పరిచినట్లు మిల మిల కాంతివంతంగా  మెరిసాయి". ఊహకి అందనంత కనులతో పట్టని వెలుతురు,ఆ సమయంలో నాకు అనిపించింది. దేవుడు ఇష్టమైన వారి కోసం ఒకరోజు లోకాన్ని అంతులేనంత అద్భుతాన్ని ఇస్తాడు ఆరోజు ,ఇదేనేమో అనిపించింది.

కానీ అది,ఇది నేను ఊహించుకున్న ఊహ, నేను ఇంటి నుండి బయటకు వచ్చాను, తను ఇంట్లో ఉండి టీవీ చూస్తుంది. నేను కూడా తనతో మాట్లాడాలని, తన టీవీ చూస్తున్న ఇంటికి వెళ్లాను, అనుకోకుండా తను నా వైపు చూసింది, నేను కూడా భయపడకుండా తనతో మాట్లాడాలి, అనుకున్నాను , మాట్లాడాలని నిర్ణయించుకున్నాను, అలా తన కనులు చూస్తూ కనులతోనే రెప్ప పాటుమాట్లాడుకున్నాం ,దగ్గరికి వెళ్లాను చూస్తూ తన కనులతో అలా  చూస్తూ ఉండిపోయింది, నాలో నాకు మాట రావట్లేదు అంతలో, అక్కడున్న వారు మమ్మల్ని గమనిస్తున్నారు. చెప్పుదామని అనుకున్నా కానీ తడబడుతున్న ఒక సేకను పాటు అగి మనసు, నిశ్చలంగా ఉంచి, మాట కలిపాను అప్పుడు నాకు అనిపించింది.

ఇన్నాళ్లు నీకోసం తప్పించును అది
ఈ రోజు కలిగింది. బాగున్నావా అని అడిగాను అప్పుడు తన అందమైన, పలికే మాటలు నా మనసుకి వినిపించింది, అదే మొదటి మధుర క్షణాలు అనిపించింది, ఇన్నాళ్లు చూడాలని అనిపించలేదా అని అడిగాను, తను మౌనంగా ఉండి పోయింది, నేను అనుకున్నాను తను మౌనం వెనుక ఎంత ప్రేమ, ఆవేదన ఉందని తెలుసుకున్నాను, ఆరోజు అలా మధుర క్షణాలతో గడిచిపోయింది.

"అది నాకు జ్ఞాపకంగా నాలో ఉండిపోయింది"

సంవత్సరానికి కలిసే ఇద్దరి మనస్సూలు ఎంతవరకు సాగుతుందో చూద్దాం.

ఎక్కడ అయినా తప్పుగా రాస్తే క్షమించండి..

© వసంత్