...

7 views

The Unlucky Girl (దురదృష్టమైన అమ్మాయి)
తాను ఒక మెరిసే మెరుపు
వెన్నెల వెలుగు వంటి చూపులు తనవి
తేనె వంటి పలుకుల మాటలు తనవి
అవును తాను ఎంతో అందమైనది,
అలాగే తెలివైనది.
తానెప్పుడూ కలలు కంటూ ఉంటుంది
తన కలలను సాధించటానికి తను చేసే
ప్రయత్నం అంతా ఇంతా కాదు ,చాలా శ్రమిస్తుంది.తనకి పెద్దగా కోరికలు లేవు కానీ తనకి ఒక అసాధారణమైన కల ఉండేది
కానీ తను ఒక అసాధారణమైన unlucky.

తనతో ఏది ఎక్కువ రోజులు ఉండదు.వస్తువులైన మనుషులైనా...
తను ఎంత జాగ్రత్త పడితే అంతకుమించి దూరం అవుతారు.ఏమి చేసినా చేయకపోయినా తనన్నంతా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి తను చాలా unlucky ఇలానే జరుగుతూ వస్తుంది.
తన ఆకరివరకు ఇలానే ఉంటుందా? అని అనుకునేది.

తను ఏది చేసిన ఏదొ ఒక సమస్య.ప్రతిరోజూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటుంది. తను త్వరగా కాలేజీకి వెళ్ళిన లేట్ అవ్వడం. తను బజారుకి వెళ్లి ఏదైనా వస్తువు తేవడానికి వెళ్తే ఆ షాప్ మూసివేసి ఉండేది లేదా ఆ వస్తువు అక్కడ లేకపోవడం. తను వంట చేసేటప్పుడు,పనులు చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేస్తుంటది.
తను ఏ మాత్రం అశ్రద్దగా ఉన్న కూడా చాలా దారుణంగా ఉంటుంది అని తనకు బాగా తెలుసు. అయినా కూడా ఏదొ ఒకటి జరుగుతూ ఉంటుంది...