...

10 views

❄️వాణీ సందేశం 🎉
ముందుగా ఎలా మొదలుపెట్టాలో అర్థం కాక ఇలా మొదలు పెడుతున్నా...
ఇదుగో అమ్మాయ్...! అసలు ఎవరే నువ్వు? నాలుగు రోజుల నీ పరిచయం తో నన్ను దోచేసుకున్నావ్....
ఈ నాలుగు రోజులు నేను నీలో ఏం చూసానో నాకైతే తెలియదు... కానీ...
నువ్వు నా పక్కన లేని ఈ క్షణం నాకు అర్ధం అయ్యింది, నాలో నేను లేను అని🤯.
అయినా నన్ను నీతో పట్టుకుపోయే అధికారం నీకెవరు ఇచ్చారోయ్....?
నేను నీ కోసం వెతుకుతున్నా...అనుకోకు నీతో పాటు నువ్ తీసుకుని పోయిన నా కోసం వెతుకుతున్నా....
అయినా ఇదేం విచిత్రమో రామాయణం లో రుక్మిణీ కళ్యాణం లా ఉంది మన పరిచయం..‌.
ఇదుగో అమ్మాయ్...! ఈ సారి మనం కలిస్తే నువ్ పట్టుకొని పోయిన నన్ను ని నాకిచ్చేయాలి.
ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు.. కానీ ఈ ఉత్తరం రాయక ముందు
రాసిన తర్వాత కూడా నేను నీ ఆలోచనలతోనే కాలాక్షేపం చేస్తున్నా. నువ్వు దూరం అయిన క్షణం నుంచి నిన్ను కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించానో తెలుసా...?
మనల్ని కలిపిన ఈ విధి ఇప్పుడు మనల్ని కలవకుండా ఆపుతుందేమో బహుశా 🤔..
పాపం పిచ్చి విధి దానికేం తెలుసు నా గురించి 🤭 . కలపడం వరకే దాని బాధ్యత ఇంక మిగిలింది అంతా నేనే చూసుకుంటా..😁
నీ గురించి రాయాలని అనుకోగానే అసలేం రాయగలను అని అనిపించింది, నాలుగు రోజుల మన ప్రయాణం అంత చెప్పుకోదగినది కాదు కదా..!😶
అందుకే నిర్ణయించుకున్నా నీ గురించి నేనేం అనుకుంటున్నానో ఒక ఉత్తరం రాయాలని ..
కానీ ఇది రాస్తుంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇది ఉత్తరం కాదేమో అని 😕.
ఏమో తల్లీ🙏 ఇది ఉత్తరమో , కవితో, కథో నాకైతే తెలియదు.... బహుశా చదువుతున్న నీకు కూడా ఇది అర్థం కాకపోవచ్చు..😑
కానీ ఒక్కటి మాత్రం నిజం నేను ఇప్పటి వరకు ఎవరి కోసం ఇలా రాయలేదు 🙈..
నీలో నాకు నచ్చిన మొదటి విషయం ఏంటో తెలుసా..? ఇంకేంటి నీ కళ్ళు 👀,ఎంత బాగుంటాయో తెలుసా...😍
చిక్కటి చీకటి లో ఒకేసారి రెండు చందమామలు ఉదయిస్తే ఎలా ఉంటుందో, నీ కళ్ళు అలా ఉంటాయి..💯
నిన్ను మొదటిసారి చూసినప్పుడు అలా నీ కళ్లనే చూస్తూ ఉండిపోయా..👁️ నువ్వు గమనించావో లేదో నువ్ నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నీ కళ్ళను అలా చూస్తూ ఉండిపోయా..🤩 అప్పుడే అర్థమైంది, పాపం నీ కళ్ళను చెక్కడానికి ఆ బ్రహ్మదేవుడు ఎంత కష్టపడ్డాడో అని🙊.
అయినా అవేం కళ్ళే బాబు నన్ను రాత్రుల్లు సరిగ్గా నిద్ర కూడా పోనివ్వకుండా చేసేసాయి😒. మళ్లీ మన పరిచయం ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ, మనం కలిసిన రోజు కచ్చితంగా నీకు ఈ ఉత్తరం ఇస్తాను..😼
ఈ ఉత్తరం కృష్ణుడి కోసం రుక్మిణీ రాసింది కాదు, నా రుక్మిణీ కోసం ఈ కృష్ణుడు రాసింది అనుకో.....
ఏంటి వీడు ఈ కాలంలో కూడా ఉత్తరాలు, రుక్మిణీ, కృష్ణుడు అంటున్నాడు అనుకోకు నేనింతే కొంచెం పాతకాలపు మనిషిని 🤓.
నీ మీద నాకున్న ఈ భావన ఇష్టమో, స్నేహమో, ప్రేమో నాకు తెలియదు. కానీ నువ్వు నా పక్కన ఉంటే నాకు నచ్చింది...😌
మన పరిచయం కి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలియదు... బహుశా మన ప్రయాణం దాన్ని నిర్ణయిస్తుందేమో...?!
నేను ఇప్పటి వరకు ఒక 800 కవితలు రాసి ఉంటా...ఒక 50 కి పైగా కథలు రాసా, కానీ మొదటి సారి ఒక ఉత్తరం రాస్తున్నాను 😬.
అందుకేనేమో కొంచెం తడబాటు గా ఉంది, చదివితే నీకే తెలుస్తుంది లే🙄.
ఇంక ఈ ఉత్తరాన్ని నీ వద్దకు చేర్చడానికి నేనింకా ఎన్ని కష్టాలు పడాలో ఏంటో🥺.
నేను ముందే చెప్పాను కదా మనం పరిచయం రామాయణం లో రుక్మిణీ కళ్యాణం లాంటిది అని మరి సాయం చెయ్యడానికి నాకు కూడా ఒక హనుమంతుడు కావాలి కదా...😟
చూడాలి మరి ఆ హనుమంతుడు ఎవరో🧐..
ఇదుగో అమ్మాయ్...! నీకో విషయం చెప్పాలి నిన్ను కలవడానికి నేను ఎంత దూరం అయినా వస్తాను..., ఎందుకంటే నేను అందరిలాంటి వాడిని కాదు ఇలా కలిసి, అలా మర్చిపోడానికి, నేను చాలా మొండివాడిని 😎.
ప్రస్తుతం నా ముందు ఉన్న లక్ష్యం ఒకటే ఎలా అయినా ఈ ఉత్తరాన్ని ఏదో ఒక రూపంలో లో నీకివ్వాలి...
చివరిగా ఒక్క మాట "ఆ కళ్ళు ఏంటే బాబు 🥰'' ఒక సారి దిష్టి తీయించుకో.
ఇంతకీ ఈ ఉత్తరానికి"వాణీ సందేశం '' అని పేరు ఎందుకు పెట్టానో చెప్పలేదు కదూ...
ఇదే "నా వాణీ కోసం నేను రాసిన సందేశం ''..✍️
© Dinesh muddada