...

8 views

ఓర్పు ...
వంట గదినే తన ప్రపంచం గా భావిస్తూ...
అర్థరాత్రి వరకూ తన భర్త కోసం ఎదురు చూస్తూ....
కనపడని ప్రేమకోసం పరితపించే ఒక సగటు ఆడపిల్ల కథ ఇది.
ఇలా మారని దినచర్య తో అలసి పోతున్న సమయంలో....
ఒక రోజు అనుకోని వార్త..
ఆ వార్త, ఆ ఇంట్లో పెను తుఫాను రేపింది.
ప్రాణానికి ప్రాణంగా భావించే తన భర్త కి యాక్సిడెంట్ జరిగింది.
దాంతో ఆ కుటుంబ భారమంతా ఆ ఇంటి కోడలి పై పడింది.
ఒక వైపు మంచాన పడ్డ భర్త ని చూసుకుంటూ..‌.
మరోవైపు వ్యాపార వ్యవహారాలను తన భుజాల మీద వేసుకుని ఆ కుటుంబాన్ని పోషిస్తుంది.
ఇది ఇలా ఉంటే తనకి ఏమాత్రం సహకరించని అత్త, మరిదిలు, మరదలు సూటిపోటి మాటలతో హింసిస్తున్నా...
తన కళ్లలో కన్నీళ్ళ ని పెదవి పై నవ్వు గా మార్చుకుంటూ ,
తన కుటుంబ పరువును కాపాడుకుంటూనే వస్తుంది.
ఆమె ఓర్పు ను భూమి తోనో లేక మహాసముద్రం తోనో పోల్చను ‌.
ఆమె ఓర్పు ,ఆమె సహనం ,ఆమె కన్నీళ్ళు
కు వెలకట్టలేనివి.
ఆమె ప్రేమ అమ్మ తనానికి ప్రతీక..
కానీ ఏదో ఒక రోజు ఆమె ఓర్పు నశించి,
ఆ కుటుంబ సభ్యులకు గుణపాఠం నేర్పే ...
మహా కాళీ అవతారం ఎత్తేందుకు, సంసిద్ధం గా ఉన్న ఒక స్ఫూర్తి దాత కధ ఇది.
ఇది ఇంకా ప్రారంభం మాత్రమే.......
© Dinesh muddada