...

0 views

"శ్రీ కృష్ణ మహా భారతం - 56"
"శ్రీ కృష్ణ మహా భారతం - 55" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 56"

అసలే కర్ణుడిని సందేహిస్తున్న విదురుడు...
పాండవులు కుంతీ వారణ వర్తం వెళ్ళిపోయాక,
తన రహస్య మందిరానికి వచ్చి, తనకి అత్యంత విశ్వాస పాత్రుడైన ఒక సైనికుడిని పిలిచి,
"నాకు కర్ణుడి ఆలోచనల మీద సందేహంగా ఉంది.
కాబట్టి, నువ్వు అతడి మీద ఒక కన్ను వేసి, అతడిని అనుక్షణం ఒక కంట కనిపెడుతూ ఉండు..!" అంటూ అతడిని ఆదేశిస్తాడు.


ఇక కర్ణుడు మనసెం బాగోలేక తనని పెంచిన తల్లిదండ్రులు అయినా పాండు రాజు రథసారథి అతీరధుడు మరియు రాధమ్మ నివాసానికి వస్తాడు.

కర్ణుడిని చూసిన రాధమ్మ ఆనందంతో ఉప్పొంగిపోతుంది.
అతీరదుడికి మాత్రం కర్ణుడి మీద ఇంకా కోపం తగ్గదు. తన మాట కాదని దుర్యోధనుడితో స్నేహం చేస్తున్నాడు కదా !

ఇక రాధమ్మ మాత్రం అవెం పట్టనట్టు, కర్ణుడిని దగ్గరకు తీసుకుని ఎన్నాళ్ళ నుండో దాచుకున్న తన తల్లి ప్రేమను అతనిపై కురిపిస్తూ ఉంటుంది.

కర్ణుడు...
"నీ చేతి గోరుముద్దలు తిని చాలా రోజులు అయ్యింది రాధమ్మ..!
నాకు ఇప్పుడు ఒక్కసారి నీ చేతితో భుజించాలి అని ఉంది" అంటూ చాలా భావోద్వేగంతో అడుగుతాడు.

దానికి తల్లడిల్లిన ఆ తల్లి (రాధమ్మ) మనసు...
"పుత్రా కర్ణా..!
ఎందుకు ఇప్పుడు నీవు ఇంత బాధగా మాట్లాడుతున్నావ్..!
నీకు ఏదో సమస్య వచ్చి పడిందని, నా మనసు ఎందుకో కీడును సూచిస్తుంది. ఏం జరిగిందో చెప్పు నాయనా !" అంటూ కర్ణుడిని ప్రశ్నిస్తుంది.

దానికి కర్ణుడి సమాధానం మౌనమే,

ఆ మౌనాన్ని అర్థం చేసుకున్న అతీరధుడు...
"ఇప్పటివరకూ రాజభవనపు విందులు, సకల సౌకర్యాలు అనుభవించాడు కదా నీ పుత్రుడు. అవి ఇప్పుడు అగ్నిలా దహించివేస్తున్నాయి కాబోలు. అందుకే ఈ సాధారణ ఇంటికి సేదతీరడానికి వచ్చినట్టు ఉన్నాడు. అతని కళ్ళల్లో నాకా పశ్చాత్తాపం కనిపిస్తుంది." అని అంటాడు రాధమ్మ తో కర్ణుడి గురించి.

దానికి కర్ణుడు...
"గుడి ప్రాంగణంలో నాలుగు స్తంభాలు కూలిపోతే దానికి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు.
కానీ, గర్భగుడిలో దేవత విగ్రహమే నాశనం చేస్తే, అప్పుడు ఎక్కువగా చింతించాల్సిన అవసరం ఉంటుంది." అని అంటాడు
(ఈ మాటల్లో ఆంతర్యం అతీరధుడికి పెద్దగా అర్థం కాకపోయినా, అదంతా దుర్యోధనుడి అధర్మం గురించే అనుకుంటాడు. ఆ మాటల్లో ఆంతర్యం మనకి కూడా ముందు ముందు అవగతం అవుతుంది లెండి)

అతీరదుడు...
"కర్ణా..!
నీకు ఆ రోజే చెప్పాను..!
దుర్యోధనుడితో చెలిమి అంత మంచిది కాదని,
అతడు అధర్మం వైపు నిలబడ్డాడు. అతడు సర్పం లాంటి వాడు. సర్పాన్ని పాలు పోసి పెంచితే అది ఎప్పటికైనా మనల్ని కాటు వేసి, మనం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఆ రాజ్య భోగాలు వదిలి ఇక్కడకి వచ్చేసి ధర్మంగా జీవించు !" అంటూ కర్ణుడి తో అంటాడు.

దానికి కర్ణుడు...
"నేను దుర్యోధనుడికి...