...

12 views

నీకై ఒక జీవి...
పొద్దున్నే శుభోదయం అంటూ పంపుతావ్ ఓ కమ్మని కాఫీ తో.
మొదలవుతుంది రోజు నా రాజు పంపిన మెసేజ్ తో.
మళ్ళీ తొమ్మిదింటికి బ్రేక్ ఫాస్ట్ అయిందా అని ఇంకో మెసేజ్..
మధ్యాహ్నం తిన్నవా అని ఇంకోటి.
నువ్ అడిగితే చాలు కడుపు నిండిపోద్ది బంగారు...
సాయంత్రం ఇంకో కాఫీ...
రాత్రి తొమ్మిదింటికి డిన్నర్ అయిందా..
పదింటికి గుడ్ నైట్ మెసేజ్ లు...
ఇంతే
గత ఇరవై ఏళ్లుగా ఇంతే
మన జీవితాల్లో జరిగాయి బోలెడన్ని మార్పులు
నీ మెసేజ్ లో ఏ మార్పూ లేదు
ఇంకొక్క కొత్త మాటేదైనా రాకపోతుందా అని ఇన్నేళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నా
నీ మనసులోని మాట చెప్పకపోతావా అని ఇంకెన్నేళ్లయినా వేచిచూస్తా
ఆశ సంగతేమో.. అప్పుడప్పుడూ నిరాశను తెచ్చుకుంటది
దాన్ని వదిలేసా
కానీ
నమ్మకం.. చెక్కుచెదరక అదరక బెదరక ఉంది ఇన్నేళ్ళుగానూ
ఉంటది ఇంకొన్నేళ్ళు కూడా
ఏమంటారో దీన్ని..
నీకేమైనా తెలిస్తే చెప్పకూడదూ...

-నక్షత్ర
© Nakshathra