...

14 views

హిందూ మతం గొప్పదా??? క్రైస్తవ మతం గొప్పదా??
part-1
ఇది నా జీవితం లో నేను ఎదురుకున్న ప్రశ్న... ఇది ఎవరిని కించపరచడానికో లేక ఒక విమర్శించడానికో రాయడం లేదు... ఎవరి దేవుడు వారికీ గొప్ప...కానీ మా దేవుడే గొప్ప అని అనుకునే వారికీ నేనే ఇచ్చే చిన్న సందేశం అంతే...
నా దృష్టిలో అన్ని దేవుళ్ళు సమానమే...అన్ని మతాల సారాంశం కూడా ఒకటే....కాకపోతే హిందువులు రాముడు అని, క్రైస్తవులు యేసు అని, ముస్లిం అల్లా అని కొలుస్తారు.

ప్రతి ఆదివారం, సోమవారం మా అన్నయ్య వాళ్ళింటికి వెళ్లడం నాకు అలవాటు.. వాళ్ళు క్రైస్తవులు.. కానీ నాకు అలాంటి బేధం ఉండదు.. సొంత అన్నయ్య అనే అనుకుంటా ఎప్పటికి.... తను నన్ను కొన్ని ప్రశ్నలు అడిగాడు... ఒక హిందువుగా పుట్టి నేను వారికీ సమాధానం చెప్పలేకపోయినందుకు చాలా సిగ్గుపడ్డ... తరువాత వాటికీ సమాదానాలు తెలుసుకున్న...

మా అన్నయ్య అన్నాడు " నేను ఒకరోజు ఏ మతం గొప్ప అని తెలుసుకోవాలి అని వెతకడం స్టార్ట్ చేశా... అందులో నా దేవుడు చాలా గొప్పవాడు అని తెలుసుకున్న అన్నాడు..."

మీ శివుడు దేవుడు కదా... అన్ని తెలుసు గా ఎక్కడేం జరుగుతుంది అని.... అయితే

* ఆ పార్వతి దేవి ప్రాణం పోసిన బాలుడీ మొండాన్ని ఖండించేస్తాడు కదా... అది పార్వతి దేవి చేసింది అని తెలుసుకోలేకపోయాడా? సరే అది వదేలేయి అని

* పార్వతి దేవి నా కొడుకు నాకు కావాలి అని అడిగినప్పుడు... శివుడు మళ్ళీ తల తీసి అతికించవచ్చుగా? ఉత్తర దిక్కులో ఉన్న తలని తేవడం ఎందుకు? ఆయన దేవుడు కదా.. మళ్ళీ దానికోసం ముకోటి దేవతలు వస్తారు.. ఎం చెయ్యలేరు
అదే నా దేవుడు అయితే స్మశానం లో ఉన్న మనిషిని కూడా పేరుపెట్టి పిలిస్తే... 4రోజుల తరువాత కూడా బయటకు వచ్చిన వారు ఉన్నారు. యేసుప్రభునీ అప్పగించబడేటప్పుడు మా దేవుడ్ని తీసుకెళ్తావా అని భటుడి చెవి కొస్తే... తెగి కింద పడుతుంది... అది నా దేవుడు తీసి అలా పెట్టేస్తాడు...అంత గొప్పవాడు నా దేవుడు అని చెప్పాడు... నా దెగ్గర సమాధానం లేదు ఎందుకంటే చిన్నప్పటి నుండి నా దేవుడు నా దేవత.. మా అమ్మ నాన్న అని భావించేదాన్ని... కాబట్టి నాకు వేరే దేవుళ్ళ గురించి అంతగా తెలియదు... అని చెప్పా

* హనుమంతుడు చాలా గొప్పవాడు.. అన్ని శక్తులు ఉన్న వాడు కదా... సంజీవిని తేమంటే అది తెలియక కొండా అంత ఎందుకు తెస్తాడు అని అడిగాడు.

రాముడు దేవుడే కదా... తన తముడ్ని తానే కాపాడుకోవొచ్చుగా.... ఎవరో ముని వచ్చి సంజీవిని రసం పోస్తే గాని బతకడు అంటే సంజీవిని కోసం హనుమాన్ నీ పంపిస్తారు... అనీ అన్నాడు... దేనికి నా దెగ్గర సమాధానం లేదు..

ఇంటికి వచ్చా అమ్మని అడిగా.. ఎం చెప్పలేదు... తాత అని అడిగా కొన్ని చెప్పాడు... అవి నిజామా కదా అని... చాలా సెర్చ్ చేశా... తెలుసుకున్న

Remaining in next part...

© Vinni🖤