...

3 views

"ది ఎఫైర్ (ruins a human life) - 1"



ఇప్పటివరకూ నన్ను, నా రచనలను ఆదరిస్తూ వస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు 🙏

ఇంతకాలం ఆధ్యాత్మిక, సామాజిక, సస్పెన్స్, హార్రర్ మరియు ప్రేమ కథలతో మీ ముందుకు వచ్చిన నేను...
ఇప్పుడొక విభిన్న సందేశాత్మక కథాంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఎప్పటిలాగే దీన్ని కూడా ఆదరిస్తారని నా ఆకాంక్ష !

ముందుగా కథకి మూలం : -
"ది ఎఫైర్ (ruins a human life) - 1" టైటిల్ లో ఉన్నట్టుగానే ఈ కథను నా వయసు పరిధిని దాటి, ఓ సాహోసోపేతమైన అంశాన్ని తీసుకుని మీ ముందుకు రావడం జరుగుతుంది. దానికి గల కారణం చుట్టూ జరిగిన మరియు జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలను పరిగణలోకి తీసుకుని, వాటి వల్ల జరిగే అనర్ధాలను, వాటి నిర్మూలనలను సమాజానికి నా ఈ కథ ద్వారా అందించాలని ఓ చిన్ని సదుద్దేశ్యంతో ..

అవును..!
బంధాలు బలపడితే అది మంచిదే, కానీ అవి సత్సంబంధాలై ఉండాలి. ఎప్పుడైతే మనిషి శారీరక సుఖం, విలాసాలకు అలవాటు పడి, తమ మధ్యనున్న బంధాలను అక్రమ బంధాలుగా మార్చుకుంటున్నాడో...
అప్పుడే ప్రతీ బంధాన్ని అనుమానించాల్సిన దుస్థితి నేటి సమాజంలో ప్రతీ వ్యక్తికి పట్టి...
చివరికి హత్య, ఆత్మహత్యలతో మానవాళి యొక్క అంతాన్ని శాసించే స్థాయికి సగటు మనిషి యొక్క దుస్థితి వచ్చిందని నా అభిప్రాయం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే !

గమనిక :
ముందుగా చెప్పినట్టు ఈ కథ కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని రాయడం జరిగింది కాబట్టి, సందర్భాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని కఠిన పదాలు వాడడం జరగొచ్చు. దయచేసి పాఠకులు తమ పరిపక్వత మనసుతో అర్థం చేసుకుని ఈ కథను ఆదరిస్తారని ఆశిస్తూ...

ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం.

                       ****************

జూన్ 9, 2023 ఉదయం 10 గంటలు కావొస్తోంది.
సరిగ్గా అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పరిధిలోని పోలీస్ స్టేషన్ కి
ట్రింగ్... ట్రింగ్... అంటూ ఒక ఫోన్ వచ్చింది.

అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఆ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోగానే,

అవతలి వ్యక్తి ...
"సార్..!
సార్..!
నేను రావులపాలెంలోని "xxxxxx" luxury హోటల్ నుండి ఒక సిబ్బందిని మాట్లాడుతున్నాను.
ఇక్కడ..!
ఇక్కడ...!!(వణుకుతున్న స్వరంతో )
మా హోటల్ లో ఒక వ్యక్తి నిన్న ఒక రూం రెంట్ కి తీసుకున్నాడు. అప్పటినుండి రూం లాక్ చేసుకునే ఉన్నాడు. మా వాళ్ళు వెళ్లి ఎంత కొట్టినా అతను డోర్ ఓపెన్ చేయడం లేదు. ఇప్పుడిప్పుడే లోపల నుండి దుర్వాసన కూడా వస్తుంది.

మీరు..
మీరు..
త్వరగా రండి సార్..!" అంటూ చాలా కంగారుగా...
కానిస్టేబుల్ శ్రీనివాస్ తో అనగానే,

వెంటనే ఆ కానిస్టేబుల్ శ్రీనివాస్ తన పై అధికారులకు విషయం చెప్పి, వాళ్ల ఆదేశాల ప్రకారం వేరే ఇంకో ఇద్దరు కానిస్టేబుల్స్ తో కలిసి ఆ హోటల్ కి హుటాహుటిన బయలుదేరి వెళ్ళాడు.

అలా అక్కడకి వెళ్లిన అతను..
వారితో కలిసి, చాలా సేపు శ్రమించి ఆ రూం డోర్ పగుల కొట్టి చూసారు. అలా రూం డోర్ తెరిచి చూసిన వాళ్ళు అక్కడ సీన్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

ఎందుకంటే, ఆ రూంలో ఆ వ్యక్తి అత్యంత దారుణమైన స్థితిలో మంచం పక్కనే గోడకు జారబడి విగత జీవిగా పడున్నాడు.

కుడి చేతి మీద కత్తి గాట్లు.. పక్కనే పదునైన చిన్న కత్తి దానివలన కారిన రక్తంతో, అతడు ఆ రక్తపు మడుగులో పడున్నాడు.

దాంతో పాటు మెడకు...