...

0 views

నేనూ మళ్లీ తల్లిని కాలేను
మాతృత్వం  స్త్రీలకు దేవుడిచ్చిన వరం. అయినా ప్రాచీనకాలం నుండి ప్రసవం  అంటే స్త్రీలకు పునర్జన్మ అని భావిస్తారు.
భావించడం ఏమిటి అక్షరసత్యం.

వైద్యశాస్త్రం మంచి ప్రగతిని సాధించినా
ప్రస్తుత కాలంలో కూడా లక్షలాది స్త్రీలు 
మరణవాత పడుతున్నారు
తల్లుల గొప్పతనం చెప్పడానికి శబ్దాలు చాలవు..

అనితకు మొదటి గర్భధారణ చాలా కఠినంగా జరిగింది. ఆ దశలో ఆమె శారీరకంగా, మానసికంగా చాలా బాధపడింది. చిన్నారి పుట్టిన తర్వాత అనితకు ఆమె బిడ్డ మాత్రమే ప్రపంచం అయింది. కానీ, కుటుంబ సభ్యులు మరో బిడ్డ కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించారు.

అనిత తన శరీరం, మనసు రెండింటికీ ఏమాత్రం సిద్ధంగా లేవని అర్థం చేసుకుంది. ఆమె ధైర్యంగా తన కుటుంబానికి చెప్పింది, "నేను మళ్లీ తల్లిని కాలేను." ఆమె నిర్ణయం ఆమె స్వతంత్రతను నిలబెట్టింది.
                       🌹 శేషం🌹
భాగం 2
ప్రసవ వేదన చెప్పడానికి మాటలు లేవు.
ఆ వేదనను అనుభవించే వారే అనుభూతి పొందగలరు..

ఇంతటి వేదనను భరించి కూడా మగువ మళ్ళీతల్లి అవుతుందని మాటవిన్న ఘడియలోనే ఆమె ఆనందం నేల - నింగి హద్దులు దాటిమనసు నృత్యం చేస్తుంది..
అంతటి వేదనను భరించే తల్లికి ప్రసవం అయ్యాక బిడ్డను తన చేతికి అందివ్వగా
ఆ   మాతృహృదయం వేదన ఎక్కడకు పారి పోతుందో ఎవ్వరికీ తెలియదు..

ఇక అనేకానేక శారీరిక కారణాల వల్ల కొందరు మళ్ళీ తల్లి కాలేరు..

సౌమ్య తన మొదటి బిడ్డను కడుపులోనే కోల్పోయింది. ఆ ఆవేదన నుండి కోలుకోవడం చాలా కష్టమైంది. రెండోసారి ప్రయత్నిస్తుందా అని కుటుంబం అడిగినప్పుడు, ఆమె స్పష్టంగా చెప్పింది, "నా హృదయం మళ్లీ ఆ బాధను ఎదుర్కోలేదు. నేను మళ్లీ తల్లిని కాలేను." ఆమె నిర్ణయానికి ఇంట్లో ఎవరూ వ్యతిరేకం చెప్పలేకపోయారు. ఆమె తన...