...

9 views

అడవి గుర్రం ( చివరి భాగం )
( అడవి గుర్రం ఒకటి, రెండు భాగాలు చదివిన తరువాతే ఈ చివరి భాగం చదవాలి )
సిద్దార్థుడు ప్రాంతం అంతా వెతికాడు వాళ్ళు కనిపించలేదు. ఆ ప్రాంతం హర్షతేజ సామ్రాజ్యంది. ఆ రాజ్యానికి రాజు నరేంద్ర భూపతివర్మ పాలిస్తున్నాడు. సిద్దార్థుడు ఆ రాజు గారి దగ్గరకు వెళ్లి "మహారాజా నమస్కారము మా మిత్రులు రూబి, హరిత కనిపించలేదు. రాజా! మీ రాజ్యంలో ఒక ప్రాంతం అయిన కంజగిరి అడవి లో నేను సెలయేరు దగ్గర దాహం తీర్చుకొని వచ్చినప్పుడు మా మిత్రులు కనిపించలేదు. వాళ్ళ గుర్రాలు కూడా కనిపించలేదు. మీరే ఎలాగైనా కనిపెట్టండి"అని అన్నాడు. రాజా వారు ఇలా అన్నారు నీవు చెప్పిన కనిపించకుండాపోయిన మిత్రులు వీరే నా అని అడిగారు. వాళ్ళను చుసి ఔను మహారాజా వీళ్లే నా మిత్రులు. "నా మిత్రులు మీ రాజ్యంలో వున్నారేంటి? అని తనకుతానే ప్రశ్నించాడు. " వీళ్ళేంటి ఈ కోట లో అని అనుకుంటున్నారా? మీ రాజ్యంలో గుర్రాన్ని అపహరింప చేసింది నేనే అని అన్నాడు. "రాజా! మా గుర్రాన్ని ఎందుకు దుండగులు చేత అపహరణ చేయించారు? అంత అవసరం ఏమొచ్చింది? అసలు మీకేం కావాలని రాజా వారి ముందర ప్రశ్నలు అడిగాడు.
అప్పుడు రాజు ఈ విధంగా సమాధానము ఇచ్చాడు " ఎన్నో శతాబ్దల కాలం నాటి నుండి గుర్రాలే మాకు బలం అవి లేకపోతే ఈ రాజ్యమే లేదు. మా రాజ్య గుర్రాల మెడ పై రెక్కల గుర్రం ఎగిరి నట్లుగా ముద్ర వేసి ఉంటుంది .దానిని రాజ గుర్రం అని అంటారు. ఆ గుర్రాల వలన యుద్ధము వచ్చిన ప్రతిసారి గెలవడమె. మా రాజ్యంలో సాంప్రదాయాలు ఎక్కువ. మా సాంప్రదాయాం ఏమిటంటే రాజగుర్రం పుట్టిన రెండు సంవత్సరములకే ఒక అడవి లో నాలుగు సంవత్సరాల పాటు వదిలేయడం జరుగుతుంది. అలా గనుక చేయకపోతే మా రాజ్యానికి పది సంవత్సరాలు దోషము కలుగుతుంది. వదిలేసిన ఆ రాజగుర్రాన్ని పొరపాటున దానిని ఒక రాజు గనుక పట్టికెళ్తె ఆ రాజ్యంలో ఉన్న యువరాజులు ఎవరైనా మా రాజ్యంలో వున్న రాకుమారి ని పెళ్ళి చేసుకోవాలి. అలా కాకుండా దొంగలయిన, సాదారణ వ్యక్తి అయిన ఆ గుర్రాన్ని పట్టుకొని వెళ్తే మా రాజ్యంలో ఖైదీ గా ముద్ర వేస్తారు లేదా రెండు సంవత్సరాలు పాటు గుర్రానికి సేవలందించాలి.
అలా జరుగుతున్న కొన్ని దశాబ్దాల తరువాత మీ తాతగారు మేము వదిలేసిన తెలుపు గుర్రాన్ని మీ రాజ్యానికి తీసుకెళ్లిన కొద్ది రోజులకు మాకు కబురు వచ్చింది. మా రాజ్యం మీ రాజ్యానికి శత్రువు. శత్రువులైనా ఈ సాంప్రదాయాన్ని తప్పక పాటించాలి. అయితే మా రాజ్యంలో రాకుమారీలు ఎవ్వరూ లేరు. రాకుమారీలు వుంటేనే వివాహానికి వర్తిస్తుంది. అలా కొన్ని సంవత్సరాల తరువాత నా కుమార్తె సౌజన్య జన్మించింది. దానికి సంవత్సరం ముందు నీవు జన్మించావు. అలా కొన్ని సంవత్సరాల తరువాత మీ రాజ్యంలో మా రాజగుర్రం మరణించడం నాకు చాలా బాధ వేసింది. నా కుమార్తె కి వయస్సు రావడంతో. నేను వివాహ విషయం మీ రాజ్యంలో కి వచ్చి నచ్చ చెప్పడం నాకు ఎందుకో ఇష్టం లేదు. మా రెండు రాజ్యల మద్య శత్రుత్వం నీకు తలిసివుండదు. మీ నాన్న గారి మనస్తత్వం తెలిసి నేను ఆ గుర్రాన్ని అపహరించాను. వీళైతె నన్ను క్షమించు . దయచేసి నా కూతురుని మాత్రం పెళ్ళి చేసుకోనని చెప్పకు.
దానికి సిద్దార్థ మహారాజు నాకు ఏ ముఖ్య నిర్ణయమైన మా నాన్న గారే తీసుకుంటారు. ఆయన నిర్ణయమే నా నిర్ణయం. మా స్నేహితులిద్దరని విడిచిపెట్టండి. మీరు నాతో మా రాజ్యనికి రండి. మా నాన్న గారితో మాట్లాడండి అని విజయ భుపతివర్మ కు దైర్యాన్ని ఇచ్చాడు. ఆ సంజయ్ రాజు ను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేసాడు. మన శత్రుత్వం మిత్రుత్వం కావాలని ఇంకా ఎన్నో మంచి మాటలతో నచ్చజెప్పాడు. ఆ అడవి గుర్రం కధ కూడా చెప్పాడు. సంజయ్ రాజు తన మాటలు విని చివరికి సంబంధం ఒప్పుకున్నాడు. అక్కడితో వాళ్ళ శత్రుత్వం నశించింది. సిద్దార్థ సౌజన్యల పెళ్ళి చాలా బాగా జరిగింది. భుపతి వర్మ పట్టికెళ్లిన ఆ గుర్రాన్ని సిద్దార్థుడికి ఇచ్చెసాడు.
ముగింపు : ఆ అడవి గుర్రం వలన శత్రువులు గా వున్న రెండు రాజ్యాలు మిత్రరాజ్యాలుగా మారాయి.

© All Rights Reserved