...

4 views

అనుకోని పరిచయం పార్ట్ -2🖤
అప్పటి నుంచి ఇంక మేము రోజు లో కనీసం 4గంటలు మాట్లాడుకునే వాళ్ళం.
తనతో మాట్లాడుతున్నంత సేపు నాకు సమయమే తెలిసేది కాదు....
తన మాటలు నాలో ఒక కవి ని మేల్కొలిపాయి..
ఎన్నో వర్ణనలు..
కొన్ని వందల కవితలు ఆమె కోసం రాసా.
తను ఒక్కో కవిత చదివి నన్ను మెచ్చుకుంటే...
నాకు మరింత ప్రోత్సాహకరంగా అనిపించింది.
నిరంతరం తన ఆలోచనలనే నా కవితా వస్తువుగా ....
నా కవితల ప్రవాహం అలా కొనసాగుతున్న సమయంలో....
ఎందుకో తనని చూడలనిపించి...
ఒక రోజు ఎలాగైనా తనని కలవాలని...
తను హాస్టల్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నా.
అనుకున్నదే తడవుగా బయలుదేరా.....
కానీ ముందు రాబోతున్న పరిణామాన్ని ఊహించలేక పోయా..
మా బావ కి ఫోన్ చేసి "రేయ్ బావ నాకు ఒక బైక్ సెట్ చెయ్ రా"
అని అడిగాను..
దానికి వాడు"రా రా బామ్మర్ది అది మన చేతిలో ఉన్న పని "అని అన్నాడు...
నాకు ఏదో తేడా కొట్టినా వాడి మాటల్లో ఉన్న ధైర్యాన్ని చూసి వెళ్లాను..
నేను మా బావ గాడి ఇంటికి వెళ్ళి చూస్తే...
నా బుర్ర బద్దలై పోయింది.
నేను వెళ్లగానే ఒక చిన్న నిస్సహాయ చిరునవ్వు తో....
"బామ్మర్ది బైక్ సెట్ అవ్వలేదు రా " అని అన్నాడు..
ఒక్క సారి నా కాళ్ళ కింద భూమి కుంగిపోయిన పోతుందనిపించింది..
కానీ ఎలాగైనా తనని కలవాలని..
వాడితో ఒక్కటే చెప్పాను.
మనం నడుచుకుంటూ వెళ్తున్నాం.. ఈరోజు నా నిక్కీ ని నేను కలుస్తాను...
నువ్వు నాతో కలిసి నడవాలి బావ అని అనగానే...
నా బావ గాడి
మొహంలో రంగులు మారడం నాకు ఇంకా గుర్తుంది...
© Dinesh muddada