...

1 views

"ది ఎఫైర్ - 10"


"ది ఎఫైర్ (ruins a human life) - 9" కి

కొనసాగింపు...

"ది ఎఫైర్ (ruins a human life) - 10"

మరుసటి రోజు ఉదయాన్నే లేచి తాను సంపాదించిన ఎవిడెన్స్... అదే సూసైడ్ నోట్ ఉన్న ఆ నోట్బుక్ తో డ్యూటీ కి వెళ్ళాడు ఎస్ ఐ.

వెళ్ళీ వెళ్లడంతోనే కానిస్టేబుల్ శ్రీనివాస్...
"ఏంటి సార్ !
ఆ సూసైడ్ నోట్ లో ఏమైనా డిటైల్స్ దొరికాయా శివరాం గురించి ?" అని అడగ్గా...

"ఇదిగో నువ్వే చదువు ..!" అంటూ అతనికి ఆ బుక్ ఇచ్చాడు ఎస్ ఐ.
ఈలోపు తన పై అధికారులకి, దొరికిన ఎవిడెన్స్ గురించి ఫోన్లో వివరించాడు. శ్రీనివాస్ ఆ సూసైడ్ నోట్ పూర్తిగా చదివే లోపు వాళ్ల పై ఆఫీసర్స్ కూడా ఆ స్టేషన్ కి చేరుకున్నారు.

ఈ విషయం మీద అత్యవసరంగా మీటింగ్ పెట్టి దాని గురించి డిస్కషన్స్ మొదలు పెట్టారు వాళ్ళు.

ఆ మీటింగ్ లో ఒక పై అధికారి...
"ఈ కేసులో శివరాం తనకు తానే సూసైడ్ నోట్ రాశాడు, అలాగే తనది సూసైడ్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో కూడా వచ్చిందని మీరు చెప్పారు. కాబట్టి, ఇది ఆత్మహత్యగా పరిగణించి ఇప్పటివరకూ విచారించిన వాళ్ళని ఇక ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి !" అని


"శివరాం, తన చావుకి కారణం వాళ్ళేనని అంత క్లియర్ గా తన నోట్ లో రాసిన తర్వాత కూడా దోషులను ఎలా వదిలేస్తాం!. వాళ్ళు చేసిన పాపాలకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే ! వాళ్ళని తప్పకుండా శిక్షించాల్సిందే" అంటూ ఇంకో అధికారి

"అలా చేస్తే తన పాప జీవితం ఏమవుతుందో ?
అది కూడా కాస్త ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉందంటూ" ఒకరు...

"పాపను కావాలంటే మనమే అడాప్ట్ చేసుకుని, బాగా చదివించి ఒక ప్రయోజకులరాలిని చేద్దాం. వాళ్ల దగ్గర ఉంటే ఏదో ఒక రోజు ఆ పాప అడ్డును కూడా తొలగించుకోవడానికి వెనకాడరు వాళ్ళు !" అంటూ ఇంకో అధికారి

ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ అభిప్రాయాలను చెప్తున్నారు.

ఎస్ ఐ మాత్రం ఏం మాట్లాడకుండా దీర్ఘంగా ఆలోచిస్తూనే ఉన్నాడు.

అది గమనిస్తున్న అతని పై అధికారులు...
"ఏంటి రఘునాథ్ (ఎస్ ఐ)
మేమందరం ఇక్కడ ఇంతలా డిస్కస్ చేసుకుంటుంటే, ఈ కేసుని ఇక్కడి వరకూ నడిపించిన నువ్వు మాత్రం, కనీసం ఏ సలహా ఇవ్వకుండా, నీ అభిప్రాయం కూడా తెలపకుండా ఇలాగే ఉండిపోయావు." అంటూ అతన్ని ప్రశ్నిస్తారు.

దానికి రఘునాథ్ మెల్లగా తన తలను వారి వైపుకి తిప్పుతూ...
"మీరందరూ ఈ కేసు క్లోజ్ అయిపోయింది అనుకుంటున్నారు.
కానీ, నేను మాత్రం ఇప్పుడే ఈ కేసు మొదలైంది అనుకుంటున్నాను" అని అంటుండగా...

"ఏంటి రఘు..!
నువ్వు చెప్పేది ?" అంటూ తన పై అధికారి ఒకరు ప్రశ్నించారు.

"అదే సార్..!
ఇక్కడ మనం శివరాం భార్య, ఆమె అన్న, తండ్రి లను విచారించాం!
కానీ, సూసైడ్ నోట్ లో శివరాం పేర్కొన్న...
నాగమణి తల్లి,...