...

0 views

aswadha tree
*_ఒకే అశ్వథ్థ వృక్షం - వృక్షంలో 22  గణపతులు...!!_*

భగవద్గీత లో శ్రీకృష్ణుడు
వృక్షాలలో అశ్వథ్థ వృక్షాన్ని నేను అని అంటాడు.

🌿అశ్వథ్థవృక్ష
మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యభాగాన
శ్రీమహావిష్ణువు,
వృక్షాగ్రాన మహేశ్వరుడు అనుగ్రహదర్శనమిస్తున్నారని  పురాణాలు వివరిస్తున్నాయి. 

అందువలననే అశ్వథ్థ వృక్షాన్ని
వృక్షరాజుగా పిలుస్తారు.
ఇంతటి మహిమాన్వితమైన
అశ్వధ్ధవృక్షంలో  స్వయంభూగా కష్టాలను, సమస్యలను వ్రేళ్ళతో దునిమే గణపతిగా అవతరించాడు.

🌿ప్రధమంగా నర్తన గణపతి గా అవతరించి , పిదప
అదే వృక్షం లో 22 చోట్ల  స్వయంభూగా దర్శనమిస్తున్నాడు.

🌸'ఓం'  అనే ప్రణవమంత్రంలోని
అ,  ఉ, మ  కారాలలో ఉ కారంలో  వున్నది శ్రీ మహా విష్ణువు. 

🌿 మహావిష్ణువు స్తోత్రాలలో  "శుక్లాంబరధరం ,విష్ణుం
శశి వర్ణం,  చతుర్భుజం ,
ప్రసన్నవదనం ధ్యాయేత్ , సర్వ విఘ్నోప శాంతయే'  అని లోకాలని కాపాడే  శ్రీమన్నారాయణుడే  విఘ్నాలను తొలగించే
వినాయకునిగా అవతరించినట్లుగా తెలియచేయబడినది.

🌸అందువలన, యీ అశ్వధ్ధవృక్షంలో
శ్రీ మహావిష్ణువు వున్న ప్రదేశంలో
వినాయకుడు అవతరించాడు.

🌿1983  వ సంవత్సరము   జనవరి 26 తేదీన చెన్నై  సాలిగ్రామంలో ఒక  చిన్న కుటీరంలో యీ బాల వినాయకుని ఆలయం నిర్మించబడినది.

🌸వినాయకుని లీలలతోను
మహిమలతోను , క్రమ క్రమంగా  యీ ఆలయం అభివృద్ధి చెందినది.

🌿దక్షిణ దేశంలోనే మొట్ట మొదటగా  1987 లో యీ బాల వినాయకునికి ఏక దిన లక్షార్చన పూజ అత్యంత కోలాహలంగా జరిగింది.

🌸ఆ సాయంకాలం ఘనంగా డోలోత్సవం కూడా జరిగింది.  19..10..2000 సంవత్సరములో 
రాజ గోపురం కట్టి, ఆవరణ దేవతలను  ప్రతిష్టించడం జరిగింది.

🌿2004 సంవత్సరంలో  గణపతి
యొక్క వివిధ  రూపాలను సీమ సున్నంతో తయారు చేయదల్చారు. కానీ ,  ఆ సంకల్పానికి అనేక
అడ్డంకులు వచ్చాయి.

🌸ఆ సమయంలోనే ఆలయానికి దక్షిణ పడమటి దిశగా వున్న అశ్వధ్ధవృక్షం  మధ్య  భాగం పగులు వచ్చి బీటలు పడి కిరీటంగా,ఏనుగు ముఖంగా, దంతంగా, తొండముగాను, కర్ణములుగాను, ఒక కాలు మడచి నర్తించే నర్తన గణపతి  ప్రధమంగా స్వయంభూగా వెలిశాడు.

🌿వృక్షానికి  వెనుక భాగమున
పంచముఖ హేరంబ గణపతి , ఉచ్ఛిష్ట గణపతి అని ఒక్కొక్క రూపంగా
స్వయంభూలుగా  ఉధ్భవించసాగాయి.

🌸ఇప్పటివరకు 22 వినాయక మూర్తులు వెలిసాయి. వినాయకుడు
అనుగ్రహ ప్రసాదిగా 
కీర్తించబడుతున్నాడు.

🌿ఈ వినాయకునికి ఆరు వారాలు  వరుసగా ఆరు నిమ్మ పళ్ళు సమర్పించి
ప్రదక్షిణలు చేస్తే నెరవేరని కోరికేదీ వుండదని భక్తుల ధృఢ విశ్వాసం.  

🌸మామిడి కాయ మొదట్లో చాలా పుల్లగా వున్న పక్వానికి వచ్చి పండగానే చాలా తీయగా వుంటుంది.
కాని నిమ్మకాయ మాత్రం ఎప్పుడూ తన పుల్లదనాన్ని  కోల్పోదు.

🌿ఆవిధంగానే భగవంతునికి
భక్తుల యందు గల కరుణ , ప్రేమ  ఎప్పటికీ మారదు అని నిమ్మకాయను  సమర్పించడం ద్వారా స్వామి  మనకు
తెలియజేస్తున్నాడు. 

🌸ఆదివారాలలో
రాహుకాల సమయంలో ,
ఈ వినాయకునికి ప్రత్యేక అలంకారాలు చేసి, ఓంకార, గకార  మూలమంత్ర  త్రిశతి అర్చనలు  ప్రత్యేకంగా  జరుగుతాయి.

🌿ప్రపంచంలో యీ వినాయకునికి పలు ప్రాంతాలలో భక్తులు వున్నారు. మూడంతస్తుల రాజగోపురం దాటగానే బాలవినాయకుని దర్శిస్తాము.

🌸ఆలయ ఆవరణలో దక్షిణా మూర్తి , లక్ష్మీ నారాయణమూర్తి , దుర్గాదేవి మొ. అనుగ్రహ దేవతల దర్శనం లభిస్తుంది.

🌿ప్రాకారము వద్ద
కాంచీ మహాస్వామి విగ్రహం  సీమ సున్నంతో తయారు  చేసినది వున్నది.  ప్రతి గురువారం మహా మేరువుకి, చంద్రమౌళీశ్వరస్వామికి  త్రిశతి అర్చనలు, అభిషేకాలు
జరుగుతాయి.

🌸దాని ప్రక్క మయూర వాహనుడు, చక్ర వ్యూహ మండపంలో వళ్ళీ , దేవసేన సమేత  సుబ్రహ్మణ్యస్వామి,
అశ్వగణపతి , దుర్గాంబిక, మూషిక వాహన గణపతి
మొదలైన ఉత్సవ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.

🌿ఈ విగ్రహాల ప్రక్కన వున్న అద్దాల ద్వారా స్వామి శతాధిక మూర్తులుగా
వలయాకారంలో గోచరించి  భక్తులను పరవశింపజేస్తారు.

🌸సంవత్సరానికి ఒక సారి 
ప్రధమంగా ఆవిర్భవించిన నర్తన గణపతికి నవంబర్ 29 వ తేదీన  ప్రత్యేక పూజలు జరుపుతారు.

🌿తరువాత హనుమంతుని సన్నిధి. ఇక్కడ హనుమజ్జయంతి,
శ్రీ రామనవమి  సమయాలలో , యీ సన్నిధిలో ఒకే రోజు లో
ఒక లక్ష సార్లు  విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. 

🌸తరువాత అశ్వధ్ధ  వృక్ష వినాయకుని క్రింద సర్ప విగ్రహాలు ప్రతిష్టించబడినవి. అశ్వథ్థ వృక్షానికి సమీపాన సప్తమాతృకల
చిత్రపటాలు దర్శన మిస్తాయి.

🌿ప్రతి శుక్రవారం
రాహుకాలంలో ఈ ఆలయంలో కన్యా దోష నివృత్తి పూజలు ప్రత్యేకంగా జరుపుతారు. ఆలయంలో నిత్యం చతుర్వేద పారాయణం జరుగుతుంది.

🌸 కంద షష్టి ఉత్సవం , ఉత్తరఫల్గుణి   ఉత్సవ  రోజుల్లో స్కందుని కి కళ్యాణం జరుపుతారు.

🌿దుర్గాదేవి కి నవరాత్రి పూజలు కోలాహలంగా చేస్తారు. జనవరి 18వ తేదీ నుండి 26 వ తేదీ వరకు వసంతోత్సవం వైభవంగా జరుపుతారు.
ఆ సమయంలో అన్ని హోమాలు  చేస్తారు.

🌸జనవరి 26 వ తేదీన గణపతి రధాయాత్ర ఉత్సవం, ఏనుగు, అశ్వం, గరగలు, మయూర నాట్యాలు,  ఒయిలాట్టాలతో వైభవంగా జరుపుతారు.

🌿ప్రతి పౌర్ణమినాడు మధ్యాహ్నము అన్నదానం జరుగుతుంది.
చెన్నై  సాలిగ్రామం భరణి కోలనీలో బిగ్ బజార్ సమీపమున ఈ అశ్వధ్ధ వృక్ష బాలగణపతి అలయంవుంది

🌸అశ్వధ్ధ వృక్షాల క్రింద వినాయకుడు దర్శనమిస్తూనే వుంటాడు.
కాని ఈ ఆలయంలో అశ్వధ్ధ వృక్షమే  22 గణపతి  రూపాలతో  దర్శనం ఇవ్వడమనే అద్భుతం చూపరులకు విస్మయాన్ని కలిగిస్తుంది

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿© director.gopikiran