క్యాసెట్ చెప్పిన కథ
#WritcoStoryChallenge
ఈ వేసవి సెలవులకు ఎక్కడకు వెళ్తారు అని తల్లితండ్రులు వారి పిల్లల్ని అడుగగా , వారి పిల్లలు వాళ్ళ తో తమ అవ్వ, తాతయ్య ఇంటికి వెళతామని నిశ్చయించుకుని వారి తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. వారి తల్లితండ్రులు వారి మాటకే సరే నని ,ఆ ఇద్దరి పిల్లల్ని బస్ లో ఎక్కిపించారు. వారు హాయిగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అవ్వ తాతల వూరు కి వెళుతున్నారు. అంతలోపు వీరి తండ్రి( భాస్కర్) తన అత్త, మామ కు ఫోన్ చేసి ఇలా " ఆ ... మామా , మా ఇద్దరు అల్లరి పిడుగులు ఊరికి వస్తున్నారు, ఆ గుడి వద్దకు వచ్చి వారిని recieve చేసుకో, బస్సు ఎక్కించి దాదాపు అర గంట అయ్యింది " అని చెప్పాడు భాస్కర్.
"ఆ సరే.సరే..అల్లుడు , నేను దింపుకుంటాలే వాళ్ళని" అని అన్నాడు అతని మామ.
"ఇంకేంటి ఎలా ఉన్నారు ఇద్దరు..పొలం పనులు బానే చేసుకుంటున్నారా.." అని అడిగాడు భాస్కర్.
"ఏం.. పనులో ఎంగతో....మా ఇద్దరికీ వయసు అయిపోతోంది, చిన్నోడు బతుకుతుంటే ఈ పని మాకు తప్పేది..ఎం చేస్తాం, అంతా మా తలరాత, ఇంతకీ లక్ష్మి ఎలా ఉంది!" అని అన్నాడు మామ.
"ఆ తనకేం బాగుంది" అన్నాడు భాస్కర్.
"పిల్లలతో పాటు తనని కూడా పంపుంచుంటే బాగుండు అల్లుడూ..., ఓ వారం ఉండి వచ్చేది" అని అన్నాడు మామ తన అల్లుడితో.
"ఎంటి...వారం రోజులా, అంతే ఇక, ఇంటి పని, వంట పని ఎవరు చేస్తారు మామ, నేను రోజంతా స్టోరీ లు రాసికే సరిపోతుంది , ఇక ఒక్కన్ని అన్నీ పనులు చూసుకోలే ను, తను ఒక్కరోజు ఇంటి లో లేక పోతే ఏ పనులు జరగవు" అని అన్నాడు భాస్కర్ తన మామతో.
"ఏం కథలో , ఎంటో , సరే ..అల్లుడూ నీ ఇష్టం, ఉంటాను పిల్లలు ఈ పాటికే వచ్చేసుంటారు" అని అన్నాడు మామ.
"సరే..ఉంటాను" అని ఫోన్ పెట్టేసాడు భాస్కర్.
బస్సు దిగిన అల్లరి పిడుగులు వినాయకుని గుడి వద్ద కూర్చుని వున్నారు తమ తాత కోసం. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళని ,వాళ్ళ తాతనే గుడి వద్దకు వచ్చి పిలుచుకుని పోయేవాడు. అది వాళ్ళ అలవాటు అనుకోండి...
ఇంతలో తాత ఆ ఇద్దరినీ పిలిచుకుపోవడానికి గుడి వద్దకు వచ్చాడు ఎద్దుల బండిలో.ఆ ఇద్దరు పిల్లలు సంబరంగా బండెక్కి కూర్చున్నారు.
"ఏమ్మా! లలితా...ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు చదువుతున్నది?" ,అని ప్రశ్నించాడు తాత.
"నాదా...ఇప్పుడు మూడు అయిపోయింది, నాలుగొవ క్లాస్ కి వెళ్తాను సెలవలు అయిపోగానే" అని అంది.
"మరి..నువ్వేం చదువుతున్నావు రా లోహిత్ " అని అన్నాడు తాత.
" రెండవ క్లాస్ అయిపోయింది తాత" అని అన్నాడు లోహిత్.
ఇలా వీరు మాట్లాడుకుంటూ తమ ఇంటికి చేరుకున్నారు. పక్కనే వున్న పంపు లోంచి నీళ్ళు ఎప్పటికీ వస్తుంటాయి కదా , అక్కడే వారిద్దరూ కాళ్ళు, మొహం కడుక్కుని ఇంట్లోకి వెళ్ళారు.వాళ్ళ అవ్వ వారితో కాసేపు ముచ్చటించింది. తరువాత వారికి అన్నం పెట్టీ , కాసేపు వారితో కుశల ప్రశ్నలు వేసింది అవ్వ. ఇక పొలం పనులు ఉండడంతో ఆ ఇద్దరు పొలానికి వెళ్ళారు.
"ఇంటి వద్ద జాగ్రత్త లల్లి" అని చెప్పి ఆ ఇద్దరు ముసలి వాళ్ళు పొలం పనులకి వెళ్లిపోయారు.
ఇంట్లో వీరికి టీవి నే ప్రపంపచం అంతా... jetix ఛానెల్ లో వచ్చే...